Nivetha Pethuraj Legal Battle.. నటి నివేదా పేతురాజ్ కన్నీటి పర్యంతమైంది.! సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు సుదీర్ఘమైన లేఖ ఒకటి విడుదల చేసింది.
అడ్డగోలుగా నివేదా పేతురాజ్ డబ్బు సంపాదించిందనీ, లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తోందనీ, 50 కోట్లతో ఇల్లు కొనుక్కుందనీ.. ఆమె మీద అత్యంత జుగుప్సాకరమైన రీతిలో కొన్ని ప్రచారాలు తెరపైకొచ్చాయి.
తమిళనాట వినిపిస్తున్న ఈ ఊహాగానాలపై నివేదా పేతురాజ్ స్పందించింది. పదహారేళ్ళ వయసులోనే తనకు ఆర్థిక స్వాతంత్ర్యం లభించిందని చెప్పుకొచ్చింది.
Nivetha Pethuraj Legal Battle.. ఆర్థిక ఇబ్బందులెప్పుడూ లేవు..
కష్టపడి పైకొచ్చిన కుటుంబం తమదని చెప్పుకొచ్చిన నివేదా పేతురాజ్, తన కుటుంబం 20 ఏళ్ళకు పైగా దుబాయ్‌లోనే వుంటోందని పేర్కొంది.

20కి పైగా సినిమాల్లో నటించిన తాను, ఏనాడూ అవకాశాల కోసం ఎవర్నీ దేబిరించలేదనీ, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పింది నివేదా పేతురాజ్.
‘ఏ నిర్మాతనీ ఇబ్బంది పెట్టలేదు. సినిమా ప్రమోషన్లకు సహకరించాను. నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు, మంచి పేరే సంపాదించుకున్నాను..’ అని నివేదా వివరించింది.
పట్టించుకోకూడదనుకున్నానుగానీ..
తన మీద వచ్చిన గాలి వార్తల్ని పట్టించుకోకూడదని తొలుత అనుకున్నా, అవి తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా వున్నాయని తెలుసుకుని స్పందిస్తున్నట్లు నివేదా పేతురాజ్ పేర్కొంది.
దుబాయ్‌లో ఇప్పటికీ అద్దె ఇంట్లోనే తమ కుటుంబం వుంటోందన్న నివేదా పేతురాజ్, ఆర్థికంగా తానిప్పుడు మంచి పొజిషన్‌లోనే వున్నట్లు వివరించింది.
Also Read: అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.! బోల్తా కొట్టిందిలే.!
రేసింగ్ అంటే వున్న ఆసక్తితోనే, అది నేర్చుకున్నాననీ, రేసింగ్ పోటీల్లోనూ పాల్గొంటున్నానని నివేదా పేతురాజ్ వెల్లడించింది.

కాగా, తన మీద దుష్ప్రచారం చేసినవారిపై చట్టపరమైన చర్యలకు నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తమిళనాట ఇటీవల త్రిష మీద కూడా ఇదే తరహాలో జుగుప్సాకరమైన విమర్శల్ని కొందరు పనిగట్టుకుని చేస్తోన్న సంగతి తెలిసిందే. త్రిష ఇప్పటికే న్యాయ పోరాటం ప్రారంభించింది.