Nivetha Thomas Onam.. అచ్చం పదహారణాల తెలుగమ్మాయ్‌లా కనిపిస్తోంది కదా.! కానీ, తెలుగమ్మాయ్ కాదు.! మలయాళీ ముద్దుగుమ్మ.
నివేదా థామస్.. తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఈ బ్యూటీ గురించి. ఎందుకంటే, ఆమె చేసిన సినిమాలు అలాంటివి మరి.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ మలయాళీ ముద్దుగమ్మ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
Nivetha Thomas Onam.. ‘వకీల్ సాబ్’లో కీలక పాత్రలో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ సినిమాతో నటిగా మరింత మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్.
శృతిహాసన్.. ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌గా పవన్ కళ్యాణ్ సరసన కనిపిస్తే, మరో మూడు కీలక పాత్రల్లో అంజలి, అనన్య నాగళ్ళ, నివేదా థామస్ నటించారు.

‘నిన్ను కోరి’ లాంటి సినిమాల్లో నివేదా థామస్ నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
కానీ, అందరికన్నా ఎక్కువ మార్కులు నివేదా థామస్‌కే పడ్డాయనడం అతిశయోక్తి కాదు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది మరి.!
పదహారణాల తెలుగమ్మాయే..
‘35 చిన్న కథ కాదు’ పేరుతో వచ్చిన ఓ సినిమాలో అయితే, నివేదా థామస్.. పదహారణాల తెలుగింటి ఆడపడుచులా కనిపించింది.. తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది.
మాతృభాష మలయాళం కంటే, బహుశా తెలుగులోనే నివేదా థామస్ ఎక్కువ సినిమాలు చేసి వుంటుందేమో.
తెలుగులో గలగలా మాట్లాడేస్తుంది.. తెలుగు సినీ పరిశ్రమ తనకు మెట్టినిల్లు లాంటిదని చెబుతుంటుందీ మలయాళీ ముద్దుగుమ్మ.
ఓనమ్ పండుగ సందర్భంగా, ఇదిగో ఈ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది నివేదా థామస్.
మలయాళీ పండగ అయినా.. సంప్రదాయ చీరకట్టులో పదహారణాల తెలుగమ్మాయిలానే ఒదిగిపోయింది కదూ.!
కథల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. నటిగా తనదైన గుర్తింపు సంపాదించుకుంటోన్న నివేదా థామస్, తెరపై ఎలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయడానికైనా ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది.