Nokia Connecting People ఇప్పుడంటే యాపిల్, శాంసంగ్, ఇంకోటీ.. ఇంకోటీ.. రకరకాల మోడళ్ళ మొబైల్ ఫోన్లు చూస్తున్నాం. స్మార్ట్ పోన్ల ఉధృతి నేపథ్యంలో కొత్త కొత్త బ్రాండ్లు వచ్చి పడుతున్నాయి.
హై ఎండ్ టెక్నాలజీ పేరుతో, రోజుకో కొత్త మోడల్ వెలుగులోకి వస్తున్న రోజులివి. కానీ, ఒకప్పుడు ‘కనెక్టింగ్ పీపుల్’ అంటే, నోకియా మాత్రమే.!
అప్పుడూ మోటరోలా, శాంసంగ్ వంటి ఫోన్లు వున్నాగానీ, ‘నోకియా’ అంటే, అదొక ఎమోషన్.!
ఎర్ర బటన్.. పచ్చ బటన్ కాలం నుంచీ.. నోకియా మొబైల్ ఫోన్ అంటే అదొక ఎమోషన్.!
నోకియా మొబైల్ ఫోన్ అయితే.. ఛార్జింగ్ బావుంటుంది.. వాయిస్ క్లారిటీ మెరుగ్గా వుంటుంది.. సిగ్నల్ సమస్యలు తక్కువగా వుంటాయ్.. అనే గట్టి నమ్మకం..
అప్పుడూ, ఇప్పుడూ.. ఎప్పుడూ.. ఆ నమ్మకం అలాగే.!
చాన్నాళ్ళ తర్వాత నోకియా లోగో మారింది.!
కానీ, పోటీ ప్రపంచంలో నోకియా ‘స్మార్ట్’గా ముందుకు దూసుకెళుతుందా.?
Mudra369
ఔను, నోకియా మొబైల్ ఫోన్‌ని ‘కనెక్టింగ్ పీపుల్’గా సదరు సంస్థ ప్రచారం చేయడమే కాదు, మొబైల్ ఫోన్ వినియోగదారులూ అలానే ఫీలయ్యారు.
Nokia Connecting People.. లోగో మారింది..
చాలాకాలం తర్వాత నోకియా సంస్థ తన లోగోని మార్చింది. లోగోలోని ఫాంట్ స్టైలింగ్ కూడా మారిపోయింది.! మారుతున్న కాలానికి అనుగుణంగా నోకియా కూడా తనను తాను మార్చుకోక తప్పలేదన్నమాట.
అయినాగానీ, ప్రస్తుత ఫాస్ట్ ట్రాక్ యుగంలో, నోకియా ఎంతవరకు తన ప్రత్యేకతను కొత్త లోగోతో చాటుకోగలదన్నది వేచి చూడాల్సిందే.
ఇప్పటికీ, ‘నోకియా అంటే కనెక్టింగ్ పీపుల్’ అని నమ్మేవారైతే వున్నారు. ‘ఎవరేమనుకున్నా డోన్ట్ కేర్.! నాకైతే నోకియా మొబైల్ వాడితేనే.. స్మార్ట్‌గా అనిపిస్తుంది..’ అనేవాళ్ళే ఈ సంస్థకి రాజ పోషకులు.
Also Read: యుద్ధ విమానంపై హనుమాన్.! ఎందుకీ కాంట్రవర్సీ.!
ముందే చెప్పుకున్నాం కదా.! నోకియా అంటే కొంతమందికి అదొక ఎమోషన్.! అందుకే, కాలం మారుతున్నా.. ‘నువ్వింకా అప్‌డేట్ అవలేదేంట్రా..’ అని ఎవరైనా వెటకారం చేసినా, ‘నోకియా’కే కట్టుబడి వుంటారు సోకాల్డ్ నోకియా అభిమానులు.
కొత్త లోగో మాత్రమే కాదు, నోకియా సంస్థ కొంత స్మార్ట్‌గా ఆలోచిస్తే.. పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలుగుతుంది.