Nora Fatehi In Tollywood.. అరరె.! సన్నీలియోన్ హైద్రాబాద్‌లో సందడి చేసిందే.! ఇంతకీ, ఈ సన్నీలియోన్ అసలు సిసలు సన్నీలియోన్ కాదండోయ్. ఈమె వైజాగ్ సన్నీలియోన్.!
‘నెమలి’ అనండీ, ‘వైజాగ్ సన్నీలియోన్’ అనండీ.. పేరేదైతేనేం, వెండితెరపై హాట్ హాట్ అందాల ఆరబోతతో, అదిరిపోయే ఐటమ్ సాంగ్స్ చేసేసి.. రసహృదయాల్ని ఉర్రూతలూగించిందామె.
పరిచయం అక్కర్లేని పేరామెది. ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి.! ఓ తెలుగు సినిమాకి సంబంధించిన లుక్ టెస్ట్ మోసం నోరా ఫతేహి తాజాగా హైద్రాబాద్‌లో సందడి చేసింది.
వరుణ్ తేజ్ సినిమాలో..
ఆ కొత్త సినిమా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోందిట. సినిమాలో నోరా ఫతేహి, ఓ స్పెషల్ రోల్‌లో కనిపించబోతోందిట.
ఈ మధ్య ఏ సినిమా అయినా, పాన్ ఇండియా మైండ్ సెట్‌తోనే ప్రారంభమవుతోంది. దాంతో, కాస్టింగ్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అలా, నోరా ఫతేహీని ఎంపిక చేశారన్నమాట వరుణ్ తేజ్ కొత్త సినిమాకి.! అన్నట్టు, ఈ బ్యూటీ నిజానికి ఇండియన్ కాదు.. విదేశీ భామ.
అయినాగానీ, ఇండియన్ సినిమా.. ఈ విదేశీ భామకి రెడ్ కార్పెట్ పరిచింది. కేవలం అందాల ఆరబోతతోనే నోరా ఫతేహి పాపులర్ అయ్యిందనుకుంటే పొరపాటే.
డాన్సులకి ఫిదా అవ్వాల్సిందే..
నోరా ఫతేహీ డాన్సులకి ఫిదా అవనివారెవరుంటారు.? శరీరంలో కాల్షియం ఎముకల స్థానంలో రబ్బర్ స్రింగులు వున్నాయేమో అనిపిస్తుంది ఆమె డాన్స్ చేస్తే.
అవునూ.! నోరా ఫతేహీకి ‘వైజాగ్ సన్నీలియోన్’ అనే పేరు ఎందుకు వచ్చిందబ్బా.? ఎందుకంటే, ‘టెంపర్’ సినిమాలో ఆమె పాత్రని అలాగే పరి చేశారు.
Also Read: Woa, Actress Disha Patani Turns As Director.!
ఇక, ‘ఊపిరి’ సినిమా కోసం ‘నెమలి’ అంటూ ఆమెకి ఇంట్రడక్షన్ జరిగింది. రెండు సినిమాల్లోనూ నోరా ఫతేహీ స్పెషల్ సాంగ్స్.. అదరగొట్టేశాయ్.
‘మనోహరీ..’ అంటూ ‘బాహుబలి’ (Baahubali)లోనూ స్పెషల్ సాంగ్ చేసేసింది నోరా ఫతేహీ (Nora Fatehi).!