Table of Contents
తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) అండదండలతో రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jaganmohan Reddy)రాజకీయం (YS Jagan YSRCP) రుచి చూడడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తండ్రి మరణానంతరం రాజకీయంగా ఒంటరి అవడమే కాదు, అక్రమాస్థుల కేసుల్నీల ఎదుర్కోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీని (Congress Party) కాదని, సొంత రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయంగా ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) స్థాపించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నవి రెండో సార్వత్రిక ఎన్నికలు.
Oka rajakeeya party ki elanti ennikalayina avi atyantha pradhanyamainavi. ippudunna rajakeeyallo okkasari thadabadite niladokkukovadam kashtam. alantidi, aneka rajakeya atupotlanu thattukuni YS Jagan nilabadatam chinna vishayam kane kadu.
చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం.. YS Jagan YSRCP
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు చంద్రబాబుకు కలిసొచ్చాయి. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.
ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర సమస్యలపై గట్టిగా గొంతు విప్పేందుకు తన వంతు ప్రయత్నం వైఎస్ జగన్ (YS Jagan) చేసినా, తెర వెనుక బీజేపీ (Bharatiya Janata Party) తో అంటకాగుతున్నారనే విమర్శ మాత్రం ఈ మధ్య కాలంలో ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రత్యేక హోదా (Andhra Pradesh Special Category Status) విషయంలో ఒకప్పుడు గట్టిగా పోరాడిన జగన్, ఆ తర్వాత స్వరం తగ్గించారు. కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తమకు అసలు సిసలు రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు కనుక విమర్శల తూటాలు చంద్రబాబు వైపుగా పరిమితం చేయడం వ్యూహాత్మకంగా జగన్ చేసిన అతి పెద్ద తప్పిదం.
జగన్ సంకల్పం.. పాదయాత్ర అత్యద్భుతం..
అది పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికార పార్టీని నిలదీయడంలో జగన్ సక్సెస్ అవుతూ వచ్చారు. అన్నింటికీ మించి సుదీర్ఘ పాదయాత్ర (Praja Sankalpa Yatra) వైఎస్ జగన్‌ని జనానికి చేరువయ్యేలా చేసింది.
వీలైనంత ఎక్కువగా ప్రజలతో మమేకమవడానికి ఈ పాదయాత్ర జగన్‌కి ఎంతగానో ఉపకరించింది. అలా పాదయాత్ర (YS Jagan YSRCP) పూర్తైంది. ఇలా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇది ఒక రకంగా జగన్‌కి కలిసొచ్చే అంశమే.
అసమ్మతి, అసంత్రుప్తికి తావివ్వని చాణక్యం.. (YS Jagan YSRCP)
ఒక్కసారే అసెంబ్లీ (Assembly) అభ్యర్ధులందర్నీ వైఎస్ జగన్ ప్రకటించగలిగారంటే, ఈ ఎన్నికల కోసం వైఎస్సార్ సీపీ ఎంత కాన్ఫిడెంట్‌గా సిద్ధమైందో తెలుసుకోవచ్చు. 150కి పైగా సీట్లలో విజయ బావుటా ఎగరవేస్తామని వైఎస్సార్ సీపీ నమ్ముతోంది.
కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం త్రిముఖ పోటీ కారణంగా ఏర్పడింది. ఇవన్నీ ముందుగానే అంచనా వేసి, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా తగిన వ్యూహాన్ని జగన్ రచించడంలో సఫలమయ్యారు.
Rajakeyallo anne anukunnatluga jaravu. Tickets ketayimpu sandarbhamga peddaga samasyalu lekunda Jagan choosukogaligarante, adi Kachitham ga goppathaname. Ee vishayamlo Jagan rajakeeya chanakyaniki Hatsoff cheppali.
జనసేన దెబ్బ తగులుతుందా?
జనసేన ప్రభావం ఎంత.? అన్నదానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అదే సమయంలో రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించి, చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన తాయిలాలు వైఎస్సార్ సీపీని దెబ్బ తీయొచ్చు.
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం, డేటా చోరీ, వైఎస్ వివేకా హత్య.. ఇవన్నీ ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం ఎవరికి అనుకూలంగా ఉంటుందనేదే సస్పెన్స్.
గుచ్చుకోనుంది గులాబీ ముల్లు
ప్రత్యేక హోదా సెంటిమెంట్ అటకెక్కి టీఆర్‌ఎస్ (Telangana Rashtra Samithi) సెంటిమెంట్ సీన్‌లోకి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో ఈ కొత్త ట్విస్ట్ వైసీపీకి లాభిస్తుందా.? నష్టం చేస్తుందా.? ఒక్కటైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. గులాబీ స్నేహం ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ కి ఏమాత్రం లాభం చేకూర్చదు సరికదా, కొత్త ఇబ్బందుల్ని తెచ్చే అవకాశం లేకపోలేదు.
ఏది ఏమైనా, ఈ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావో రేవో.. ఎందుకంటే పార్టీ ఫిరాయింపు రాజకీయం ముందు ఇంకోసారి ప్రతిపక్షంలో జగన్ నిలదొక్కుకునే పరిస్థితి ఉండదు. సో అధికారం దక్కాల్సిందే. దక్కుతుందా మరి.!