Table of Contents
NRI Dollar Dreams.. అయిపోయింది.! నీటి బుడగ పేలిపోయింది.! ట్రంప్ తాత పుణ్యమా అని, ‘డాలర్ డ్రీమ్స్ వద్దే వద్దు.. మన భారతమే ముద్దు’ అంటోంది ఎన్నారై కమ్యూనిటీ.!
హెచ్1బి వీసా ఖరీదైపోయింది.! అమెరికా చదువులూ ఖరీదైపోయాయ్.! అమెరికాలో మనోళ్ళకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలూ తగ్గిపోతున్నాయ్.!
ఆంక్షలు పెరిగే కొద్దీ, ‘అమ్మో అమెరికా’ అనే భయం పెరిగిపోతోంది.! ‘పురుగు’ కన్నా హీనంగా చూస్తోందిప్పుడు అమెరికా, మన భారతీయుల్ని.
NRI Dollar Dreams.. కారణాలేవైతేనేం.. అంతా మన మంచికే.!
ట్రంప్ సుంకాలు పెంచాడనో, ఇంకోటనో.. కారణం ఏదైతేనేం, ఎన్నారై కమ్యూనిటీ ఆలోచనలు మారాయి. అమెరికాలో మనోళ్ళ సంఖ్య ముందు ముందు గణనీయంగా తగ్గిపోనుంది.
‘ఇంకెందుకు అమెరికాలో వుండటం.? మన భారతావనిలోనే ఏదో ఒకటి చూసుకుందాం..’ అనే భావన ఎన్నారై కమ్యూనిటీలో పెరిగింది.
‘విద్యార్థులెవరూ, అమెరికా యూనివర్శిటీలపై ఆశలు పెంచుకోవద్దు..’ అని ఎన్నారై కమ్యూనిటీ, విద్యార్థులకు సూచిస్తుండడం గమనార్హం.
ఇప్పుడెలా.? ఇంజనీరింగ్ చేసి, అమెరికా చెక్కేద్దామనుకునే విద్యార్థి లోకానికి ప్రత్యామ్నాయం ఏమిటి.? ఎవరో ఏదో చెబితే నమ్మేద్దామా.? ఇలా మళ్ళీ బోల్డన్ని ప్రశ్నలు.
వందల కోట్లు.. వేల కోట్ల రూపాయలు మిగుల్తాయ్..
అమెరికాలో విద్య.. అంటే, అది చాలా ఖరీదైన వ్యవహారం. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ అంతే.! కాకపోతే, గతంలో కాస్త బెటర్. ఇప్పుడైతే, చాలా కష్టం. భవిష్యత్తులో ఇంకా కష్టం.
ఏడాదికి మన భారతీయ విద్యార్థులు అమెరికాలో చేస్తున్న ఖర్చు లెక్కలు తీస్తే, వందల కోట్ల కాదు.. వేల కోట్లు వుంటాయన్నది ఓ అంచనా.
‘ఇక్కడలా కాదు, అక్కడ భార్యాభర్తలిద్దరూ సంపాదించాలి.. లేకపోతే కష్టం..’ ఈ మాట, అమెరికా వెళ్ళిన వాళ్ళంతా చెప్పే మాటే.!
అక్కడి వాతావరణం, అక్కడ ఉపాధి అవకాశాలు.. ఇలా చాలా అంశాలు, అమెరికా వైపు మనోళ్ళు ఆశగా చూడటానికి కారణాలు. ఇప్పుడు ఆ బుడగ పేలిపోయింది.
అమెరికా వద్దు, మన భారతమే ముద్దు.. అనే నిర్ణయానికి వస్తే, ఆ వందల కోట్లు.. వేల కోట్లు.. ఖచ్చితంగా మిగులుతాయ్. ఇందులో సందేహమే లేదు.
వాళ్ళందరికీ అవకాశాలెలా.?
అమెరికా నుంచి మనోళ్ళంతా తిరిగొచ్చేస్తారా.? అంటే, అందరూ తిరిగి స్వదేశానికి రావడం జరగదు. కాకపోతే, చాలామంది తిరిగొచ్చే అవకాశం వుంది.
Also Read: జై చిరంజీవ.! నీ నామ జపమే వాళ్ళకి బతుకుదెరువు.!
అలా తిరిగొచ్చేవాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించగలిగే పరిస్థితి వుండాలి. అదే పెద్ద సమస్య. కానీ, తప్పదు.! తిరిగొచ్చేయడమైతే ఖాయమైపోయింది గనుక.
‘ఏదో ఒక రోజు బుడగ పగలిపోతుందని అనుకున్నాంగానీ, ఇంత త్వరగా అది జరుగుతుందని అనుకోలేదు..’ అమెరికా నుంచి తిరిగొస్తున్నవారందరిదీ ఇదే మాట.!
