NTR30 Koratala Siva.. సినిమా నిండా మృగాలు మాత్రమే.. ఒకే ఒక్క మనిషి.! ఆ మనిషే హీరో.! సినిమా లైన్ అయితే చెప్పేశాడు.! ఇక, కథని మీరే ఊహించేసుకోండి.!
యంగ్ టైగర్ ఎన్టీయార్ (Global Star NTR) కొత్త సినిమాకి సంబంధించి దర్శకుడు కొరటాల శివ రిలీల్ చేసిన పాయింట్ ఇది.
‘కోస్టల్ లైన్స్’లో ఈ సినిమా కథ నడుస్తుందట. పైగా, మనం మర్చిపోయిన కోస్టల్ లైన్స్.. అంటూ కొరటాల శివ (Koratala Siva) వ్యాఖ్యానించాడు.
కెరీర్ బెస్ట్.! అప్పుడూ అదే చెప్పావ్ కదా కొరటాల శివా.?
‘ఆచార్య’కేమో అడవి, పాదఘట్టం.. ఇప్పుడేమో కోస్తా తీరం, మృగాల్లాంటి మనుషులంటున్నావ్.!
ఏంది కథ.? గ్లోబల్ స్టార్‌ని ఏం చేయబోతున్నావ్.?
Mudra369
అంటే, తీర ప్రాంతాల్లో మృగాల్లాంటి మనుషులు.. అభివృద్ధికి దూరంగా వుండే ఆ ప్రాంతాల్లోని పరిస్థితులు.. ఇవన్నీ చూడబోతున్నామన్నమాట.
NTR30 Koratala Siva.. కెరీర్ బెస్ట్ అవుతుందిట..
‘ఆచార్య’ సినిమా తర్వాత తదుపరి సినిమాని ప్రారంభించడానికి దర్శకుడు కొరటాల శివ చాలా సమయం తీసుకున్నాడు.
ఇక, ఇప్పుడు తన కెరీర్ బెస్ట్ సినిమా.. అంటున్నాడు ‘ఎన్టీయార్30’ గురించి మాట్లాడుతూ కొరటాల శివ. గతంలో ‘ఆచార్య’ సినిమా సమయంలో కూడా ఇంతకంటే కాన్ఫిడెంట్‌గా చెప్పాడాయన.
అంతే, ఒక్కోసారి ఒక్కో ప్రాజెక్ట్ అంచనాల్ని అందుకోలేకపోవడం సహజమే. హిట్టూ.. ఫ్లాపూ.. ఎవరికైనా మామూలే. ‘ఆచార్య’ ముందు వరకూ కొరటాల శివ కెరీర్‌లో ఫ్లాప్ అనేదే లేదు.
జాన్వీ కపూర్ తొలిసారిగా..
ఎప్పుడో తెలుగులో తెరంగేట్రం చేయాల్సిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor NTR30), ఇంత సమయం తీసుకుంది. ఎలాగైతేనేం, యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR) సరసన జతకడుతోంది ఈ సినిమా కోసం.
Also Read: నీ హీరోయిన్‌నే బ్లాక్ చేసేసుకున్నావేంటి బన్నీ.!
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీయార్ (Global Star NTR), ఆ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ కూడా దక్కించుకున్నాడు.
మరిప్పుడు కొరటాల శివ (Koratala Siva), ఆ ఎన్టీయార్ గ్లోబల్ ఇమేజ్‌ని ఇంకెంత పెంచుతాడో వేచి చూడాల్సిందే.!