Operation Sindoor.. ఆపరేషన్ సిందూర్ మొదలైంది.! పహల్గామ్ టెర్రర్ అటాక్‌కి బదులిచ్చేశాం.! అర్థరాత్రి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సహా, పాకిస్తాన్‌లోని కొన్ని లక్ష్యాల్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించాం.
భారత త్రివిధ దళాలు.. అంటే, నేవీ అలానే మిలిటరీ, ఎయిర్ ఫోర్స్.. సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ని చేపట్టాయి.
దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి, భారతదేశంపైకి తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌కి ధీటైన బదులిచ్చింది భారతదేశం ఇంకోసారి.
గతంలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్.. కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనే జరగ్గా, ఈసారి ఏకంగా పాకిస్తాన్‌లోని లక్ష్యాల్ని కూడా ఛేదించింది ‘ఆపరేషన్ సిందూర్’
Operation Sindoor.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.?
1971 తర్వాత పాకిస్తాన్‌లోని లక్ష్యాల్ని భారత త్రివిధ దళాలు ఛేదించడం ఇదే తొలిసారి.. అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాల్ని ఛేదించేందుకు త్రివిధ దళాలు ఎలాంటి మిస్సైళ్ళను ప్రయోగించాయన్నదానిపై కొద్ది గంటల్లోనే స్పష్టత రానుంది.
భారత వాయు సేన నుంచి రాఫెల్, సుఖోయ్ 30, మిగ్ 29, మిరేజ్, తేజస్.. తదితర యుద్ధ విమానాలు, సరిహద్దులకి పహారా కాస్తున్నాయి.
మరోపక్క, మిలిటరీ నుంచి.. పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛింగ్ సిస్టమ్ సహా, అనేక శతఘ్నులు, బ్యాటిల్ ట్యాంక్స్ సరిహద్దుల్లో సిద్ధంగా వున్నాయి.
సముద్ర జలాల్లో అణు జలాంతర్గాములు, విమాన వాహక యుద్ధ నౌకలు, ఇతర యుద్ధ నౌకలు.. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి దాడినైనా తిప్పి కొట్టేందుకు సిద్ధమేనంటున్నాయి.
దెబ్బ అదుర్స్..
ఈసారి కొట్టే దెబ్బ.. ఇకపై ఎప్పుడూ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు వీల్లేకుండా తగలాలన్నదే భారత త్రివిధ దళాల వ్యూహంగా కనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్.. తిరిగి భారతదేశంలో కలిసేలా, ఆపరేషన్ సిందూర్ వుండబోతోందని ఆశించవచ్చు.
అదే జరిగితే, పాకిస్తాన్ నుంచి తీవ్రవాద ముప్పు భారతదేశానికి దాదాపుగా తొలగిపోయినట్లే అవుతుంది.
Also Read: గుడిసేటి మాటలెందుకు? గుడి మెట్లు కడిగి చూడు ప్రకాష్ రాజ్!
కొద్ది రోజుల క్రితం పహల్గామ్‌లో హిందూ టూరిస్టుల్ని, వారి మతాన్ని కన్ఫామ్ చేసుకుని మరీ తీవ్రవాదులు అత్యంత కిరాతకంగా చంపేసిన సంగతి తెలిసిందే.
‘నన్నూ చంపెయ్..’ అని ఓ తీవ్రవాదితో బాధిత మహిళ ఒకరు అడిగితే, ‘నిన్ను వదిలేస్తున్నాను ఎందుకో తెలుసా.? వెళ్ళి మోడీకి చెప్పుకుంటావని..’ అని ఆ తీవ్రవాది చెప్పాడు.
భారత మహిళల నుదుటన సిందూరాన్ని పాకిస్తానీ టెర్రరిస్టులు చెరిపేసిన దరిమిలా, పాకిస్తాన్ మీద చేపట్టిన ఆపరేషన్‌కి ‘ఆపరేషన్ సిందూర్’ అని నామకరణం చేసింది భారత ప్రభుత్వం.
ఇంకోపక్క, భారత దేశానికి ‘తల’ లాంటి, కాశ్మీర్ ప్రాంతం నెత్తిన ఇకపై రక్తపాతం అనేది వుండకూడదన్న కోణంలో, ఆ నుదుట భాగానికి ‘ఆపరేషన్ సిందూర్’తో సిందూరం అద్దనున్నాయి త్రివిధ దళాలు.!