అక్కు పక్షీ.! విమానాల్ని ఎందుకు కూల్చేస్తున్నావ్.?

Aero Plane Bird
Aero Plane Bird Accident.. బ్యాక్ టు బ్యాక్.. రెండు విమనాలు కుప్ప కూలిన దరిమిలా, ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణాల విషయమై ఆందోళన నెలకొంది.
అలాగని, విమానాల్లో ప్రయాణించడం మానేస్తామా ఏంటి.? అది కుదరని పని. విమాన యానం.. దేశాల్ని కలిపిందనడం అతిశయోక్తి కాదేమో.!
ఖండాంతరాలు దాటి వెళ్ళడానికి విమాన ప్రయాణమే గతి.! రెండు మూడొందల కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి కూడా విమానాల్ని ఆశ్రయిస్తున్న రోజులివి.
Aero Plane Bird Accident.. లోహ విహంగాలు.. ప్రమాదాలు..
ఎక్కడో వేరే దేశాల్లో విమాన ప్రమాదాలు జరిగితే మనకేంటి.? అనుకోకూడదు. ఇక్కడ, మన దేశంలోనూ విమాన ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి.
కొన్నాళ్ళ క్రితం కేరళలో ఓ విమానం రన్ వే మీద అదుపు తప్పి, ప్రయాణీకుల ప్రాణాల్ని తోడేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా విమాన ప్రమాదాల్లో మానవ తప్పిదాలే ఎక్కువగా వుంటాయ్.
వాతావరణం అనుకూలించకపోవడం, పక్షుల తాకిడి కూడా విమానాలు ప్రమాదాల బారిన పడటానికి కారణాలుగా చెబుతుంటారు.
ఎక్కడన్నా విమాన ప్రమాదం జరిగితే, ఎక్కువగా వినిపించే కారణం, అనుమానం.. ‘విమానాన్ని పక్షి ఢీ కొట్టింది’ అనే.!
లోహ విహంగాలకీ, విహంగాలకీ ఎక్కడ చెడింది.?
ఆకాశంలో ఎగిరే పక్షులతో, అదే ఆకాశంలో ఎగిరే విమానాలకు ప్రమాదమేంటి.? అంత పెద్ద విమానాన్ని, చిన్న పక్షి కూల్చేయగలదా.? అన్న డౌట్ చాలామందికి రావొచ్చు.
విమానం ఇంజిన్‌లోకి పక్షులు వెళ్ళిపోతే, ఇంజిన్ ఫెయిల్యూర్‌కి దారి తీయొచ్చు. ఒక్కోసారి పక్షులు ఢీ కొట్టడంతో, విమానం అద్దాలు పగిలిన సందర్భాలూ లేకపోలేదు.
ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పక్షులు ఎక్కువగా సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ, పక్షుల్ని పూర్తిగా నిలువరించలేం కదా.?
పక్షుల వల్ల విమానాలకి ప్రమాదాలు మామూలే.! కానీ, చాలా అరుదుగా పక్షుల వల్ల ఘోర విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి.
Also Read: ట్రెండింగ్‌లో కీర్తి సురేష్ ‘తాళి’.!
పక్షులు స్వేచ్ఛగా ఎగిరే ఆకాశంలోకి విమానాల్ని తీసుకెళుతున్నది మనమే.! పక్షుల తప్పేమీ లేదిక్కడ.!
తాజా విమాన ప్రమాదం నేపథ్యంలో 179 మంది ప్రాణాల్ని తీసేసిన పక్షి.. అంటూ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే, నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి.
ఇంకా నయ్యం.. ఆత్మాహుతికి పాల్పడిన పక్షి.. 179 మంది ప్రాణాలు పోయిన వైనం.. అని మీడియాలో చర్చోపచర్చలు జరగలేదు.! కక్కుర్తి మీడియా కదా, ముందు ముందు అదీ చూస్తామేమో.!
