Operation Sindoor HAL Tejas.. యుద్ధ విమానాల తయారీ విషయంలో భారత దేశం, ఒకింత ‘అలసత్వం’ ప్రదర్శిస్తూనే వుందన్నది నిష్టుర సత్యం.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఇదే వాస్తవం.! లేకపోతే, దశాబ్దాలుగా ‘హెచ్ఎఎల్ తేజస్’ యుద్ధ విమానం, ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడమేంటి.?
నిజానికి, తేజస్ యుద్ధ విమానాలు, భారత రక్షణ రంగంలో చేరి ఏళ్ళు గడుస్తోంది. ‘మిగ్-21’ యుద్ద విమానాల్ని, ఈ తేజస్ యుద్ధ విమానాలు రీప్లేస్ చేయాల్సి వుంది.
Operation Sindoor HAL Tejas.. ఏదీ ఆ తేజస్సు.?
తేజస్ యుద్ధ విమానాన్ని, భారత అవసరాల కోసమే కాదు, ఇతర దేశాలకు విక్రయించడం ద్వారా, ఆదాయాన్ని పెంచుకునే మార్గంగానూ చూస్తోంది భారత ప్రభుత్వం.
వివిధ దేశాలు తేజస్ యుద్ధ విమానం కోసం, భారత దేశాన్ని సంప్రదిస్తున్నమాట వాస్తవం. అయితే, ‘ఆపరేషన్ సిందూర్’లో తేజస్ యుద్ధ విమానాన్ని వినియోగించారా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు.
ఓ యుద్ధ విమానం తాలూకు పూర్తిస్థాయి సత్తా అనేది, ఇలాంటి సందర్భాల్లోనూ నిరూపితమవుతుంటుంది. అలా చూసుకుంటే, ఆపరేషన్ సిందూర్ ‘తేజస్’కి అందివచ్చిన అవకాశమే.
తేజస్ యుద్ధ విమానానికి మరిన్ని మెరుగులు..
తేజస్ యుద్ధ విమానానికి మరిన్ని మెరుగులు దిద్దాల్సి వుంది. బోల్డన్ని వేరియంట్స్ రావాల్సిన అవసరం కూడా వుంది. అవన్నీ, ప్రయోగాల దశలో వున్నాయి.
నేవీ అవసరాల నిమిత్తం, తేజస్‌లో కొన్ని మార్పులు చేయాల్సి వుండగా, అసవరమైన మార్పులు చేసినా, ‘కొన్ని పారామీటర్స్’ని అవి అందుకోలేకపోయాన్న వాదనలున్నాయి.

ఒక్కటి మాత్రం నిజం. తేజస్ అత్యాధునిక యుద్ధ విమానమే. దాన్ని అనుసరించి, ఆ కోవలో మరిన్ని వేరియంట్స్‌ని తేలిగ్గానే తయారు చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది.
రానున్న ఐదు పదేళ్ళు, తేజస్ యుద్ధ విమానాలకు స్వర్ణ యుగమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విభాగంలో భారత్ తయారీ.. సరికొత్త యుద్ధ విమానాలు ముందు ముందు అందుబాటులోకి రానున్నాయి.
Also Read: సైనికుల్ని పని చెయ్యనిద్దాం.! బోడి సలహాలు మానేద్దాం.!
పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో తేజస్ యుద్ద విమానాలు తయారవబోతున్నాయి రానున్న కాలంలో.
అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో కూడిన తేజస్ యుద్ధ విమానాలు, భారత రక్షణ రంగంలో అత్యంత కీలకం కాబోతున్నాయన్నది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం.