Operation Sindoor IAF.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకమైన ప్రకటన చేసింది ‘ఆపరేషన్ సిందూర్’ విషయమై.
కాల్పుల విరమణ ఒప్పందానికి పాపిస్తాన్ ముందుకు రావడం, భారత్ కూడా సానుకూలంగా స్పందించడం తెలిసిన విషయాలే.
ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది. ఏ లక్ష్యంతో అయితే, ఆపరేషన్ సిందూర్ చేపట్టామో, అది విజయవంతమయ్యిందన్న చర్చ ఓ వైపు జరుగుతోంది.
ఇంకో వైపు, అర్థాంతరంగా ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందన్న ఆవేదన సగటు భారతీయుల్లో వుంది.
Operation Sindoor IAF.. రేపే అత్యంత కీలకం..
ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) నుంచి కీలక ప్రకటన విడుదలైంది.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందంటూ.
ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ అమల్లో వున్నా, అది రేపు మధ్యాహ్నం తర్వాత ఎలా టర్న్ తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇరు దేశాలకు చెందిన సైనిక విభాగ ఉన్నతాధికారులు, రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హాట్ లైన్ ద్వారా చర్చించుకుంటారు.. ఆ తర్వాతే కీలక నిర్ణయం వెలువడుతుంది.
కాగా, ‘ఆపరేషన్ సిందూర్’లో త్రివిధ దళాలూ పాల్గొన్నా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత కీలకంగా వ్యవహరించింది.
అత్యంత ఖచ్చితత్వంతో..
పాపిస్తాన్‌కి చెందిన ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని, అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగలిగింది ఎయిర్ ఫోర్స్. అలానే, పాపిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాల్నీ ఐఏఎఫ్ ధ్వంసం చేసింది.
అసలు పాపిస్తాన్‌కి భారత సైన్యం నుంచి కలిగిన నష్టం ఎంత.? అన్నదానిపై కొంత గందరగోళం వుంది. ఈ క్రమంలోనే, భారతీయ వాయు సేన, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.

ఈలోగా ఎలాంటి గందరగోళానికీ తెరలేపకుండా.. సైన్యం ఏం చేస్తుందో వేచి చూడటమే సగటు భారతీయుడి బాధ్యత.
Also Read: మైనింగ్ దొంగ: ‘గాలి’కి ఏడేళ్ళ జైలు శిక్ష.. పదిహేనేళ్ళ తర్వాత.!
బోల్డన్ని పుకార్లు సోషల్ మీడియా వేదికగా సంచరిస్తున్న దరిమిలా, వాయు సేన నుంచి ఈ కీలక ప్రకటన వచ్చిందని అనుకోవచ్చు.