Paapam Pasivaadu Jagan Pawankalyan.. కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. ఇది పెద్దలు చెప్పే సామెత.! మనలో చాలామంది.. కాదు కాదు, అందరూ వినే వుంటాం.!
అసలు విషయానికొస్తే, ‘పాపం పసివాడు’ సినిమా టైటిల్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ‘పాపం పసివాడు’. అప్పట్లో చాలా పెద్ద హిట్.!
ఆ టైటిల్‌తో ఇప్పుడు కొత్తగా ఎవరైనా సినిమా తీస్తే బావుంటుందట.! ఈ ఆలోచన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వచ్చింది.
‘పాపం పసివాడు’ సినిమాని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తీయాలన్నది జనసేన అధినేత ఉవాచ.! అసలెందుకీ ఆలోచన.?
Paapam Pasivaadu Jagan Pawankalyan.. సూట్ కేసు కాదు.. సూట్ కేసు కంపెనీలు..
ఎండారి ప్రాంతంలో ‘పాపం పసివాడు’ సినిమా తీశారు. ఓ చిన్న విమానం ఎడారి ప్రాంతంలో కూలిపోతే.. అందులో ఇరుక్కుపోయిన పసివాడి పాట్లు ఆ సినిమా కథ.

అయితే, జగన్ మోహన్ రెడ్డి మీద తీసే ‘పాపం పసివాడు’ సినిమా కోసం ఇసుక సమస్య లేదట. వైసీపీ నేతలు నదీ గర్భాల నుంచి కొల్లగొట్టిన ఇసుకని స్టోర్ చేసే పాయింట్ల వద్దనే చాలా ఇసుక సినిమా కోసం దొరుకుతుందట.
అంతే కాదు, ‘పాపం పసివాడు’ సినిమాలోని పిల్లాడి చేతిలో సూట్ కేసు వుందనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సినిమాలో సూట్ కేసు కంపెనీల ప్రస్తావన వుండాలని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారు.
తమలపాకుతో నువ్వొకటిస్తే..
వెనకటికి ఓ ముతక సామెత వుంది. తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నదే ఆ సామెత.
పదే పదే ‘దత్త పుత్రుడు’ అంటూ పవన్ కళ్యాణ్‌ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శిస్తున్న దరిమిలా, ఇదిగో పవన్ కళ్యాణ్ ఇలా ‘పాపం పసివాడు’ అంటూ సెటైరేశారన్నమాట.
Also Read: పవన్ కళ్యాణ్ 100 కోట్లు.! ఎంత దూరంలో.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. పవన్ కళ్యాణ్ మీద విమర్శల కోసం ముఖ్యమంత్రి చాలా చాలా ఖర్చు చేయాలి. సరైన వేదిక ఎంచుకోవాలి.
పవన్ కళ్యాణ్‌కి ఆ సమస్య లేదు. ఓ ట్వీటేస్తే, క్షణాల్లో లక్షల మందికి, కోట్ల మందికి చేరువైపోతుంది. ఆ ఇంపాక్ట్ వేరే లెవల్‌లో వుంటుంది.