Lavanya Varuntej Niharika SDT.. ఇది మీకు తెలుసా.? లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్ళి జరగబోతోందిట.! జూన్‌లో నిశ్చితార్ధమట.!
పాత వార్తలా వుంది కదా.? పాత సీసాలో కొత్త సారా.. కొత్త సీసాలో పాత సారా.! ఇందులో ఏది నిజం.? అసలంటూ విషయం వుందా.? లేదా.? ఈ ప్రచారంలో.?
నిప్పు లేకుండా పొగ రాదు మామూలుగా అయితే.! కానీ, ఈ తరహా గాసిప్స్ విషయంలో నిప్పుతో సంబంధమే లేదు.. పొగ పుట్టేస్తుంది.!
Lavanya Varuntej Niharika SDT.. సాయి ధరమ్ తేజ్ – నిహారిక పెళ్ళన్నారే.!
మొన్నీమధ్యనే.. అంటే, ‘విరూపాక్ష’ (Virupaksha Movie) సినిమా రిలీజయ్యాక, సాయి ధరమ్ తేజ్ – నిహారిక పెళ్ళంటూ ప్రచారం జరిగింది.
వాస్తవానికి.. ఇది కూడా పాత గాసిప్పే.! ఆ పాత వంటకానికి మళ్ళీ కాస్త మసాలా దట్టించి వదిలింది ‘తెగులు’ మీడియా (Telugu Media).!
నిహారికకి ఆల్రెడీ పెళ్ళయ్యింది.. ఆమె భర్త నుంచి విడిపోయిందనే ప్రచారం జరుగుతోంది ఓ పక్క. ఇంతలోనే నిహారిక – సాయిధరమ్ తేజ్ పెళ్ళంటూ పుకార్లు.
ఏదో ఒకటి నిజం కాకపోతుందా.?
గోతికాడి నక్కలా ఓ సెక్షన్ మీడియా ఇలాంటి గాసిప్స్ విషయంలో కాచుక్కూర్చుంటోంది. వున్నదీ లేనిదీ, వండి వడ్డించడమే దాని పని.!
ఇంతకీ, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) – వరుణ్ తేజ్ (Varun Tej) పెళ్ళి నిజమేనా.? సాయి ధరమ్ తేజ్ – నిహారిక వ్యవహారమేంటి.? రాసుకున్నోడికి రాసుకున్నంత.!
ఖండించినా అవే గాసిప్పులు.. ఖండించకపోయినా అవే గాసిప్పులు.. అందుకే, మెగా కాంపౌండ్ చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందేమో ఈ గాసిప్స్ విషయంలో.
Also Read: ‘లైగర్’ బాబూ.! అనసూయ సంగతేంటో చూడు.!
కొద్ది నెలల క్రితం లావణ్య – వరుణ్ పెళ్ళి చేసేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. ఔనా.? నా పెళ్ళి గురించి నాకైనా చెప్పొచ్చుగా.? అంటూ లావణ్య సెటైరేసింది.
ఇక, నిహారిక అయితే, జరుగుతున్న దుష్ప్రచారం పట్ల పూర్తిగా లైట్ తీసుకుంది. చాలాకాలం నుంచి నిహారిక – సాయి ధరమ్ తేజ్‌ల పెళ్ళి అంటూ గాసిప్స్ వస్తూనే వున్నాయ్.
కానీ, నిహారికకి చైతన్య అనే వ్యక్తితో కొన్నాళ్ళ క్రితం పెళ్ళయ్యింది. ఆ పెళ్ళి పెటాకులయ్యిందంటూ ఓ పెంట.. దానికి తోడు, మళ్ళీ సాయి ధరమ్ తేజ్‌తో పెళ్ళంటూ పుకార్లు.!
అసలు తెలుగు మీడియా ఇంత తెగులు పట్టినట్లు ఎందుకు వ్యవహరిస్తోందిట.?