Paid Negativity On RRR: ‘ఆర్ఆర్ఆర్’ – ఇది కమ్మ, కాపు ఐక్యత కోసం తీసిన సినిమా.! ఇదండీ వరస.. కాస్తంతైనా సిగ్గనిపించడంలేదేమో.. ఇలా ప్రచారం చేసేవాళ్ళకి.!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, యంగ్ టైగర్ ఎన్టీయార్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఈ ఇద్దరినీ కలపడం ద్వారా తెర వెనుక రాజకీయ సమీకరణాలు సెట్ అవుతాయని పెద్ద స్కెచ్ ఎవరో వేశారంటూ అనూహ్యమైన రీతిలో ప్రచారం జరిగింది.
ఇంతకంటే, సిగ్గుమాలినతనం ఇంకోటేదైన వుంటుందా.? కానీ, నిస్సిగ్గుగా రూమర్స్ ప్రచారం చేశారు. తద్వారా పొందే పైశాచిక ఆనందం ఏంటో సో కాల్డ్ మేధావులకే తెలియాలి.
Paid Negativity On RRR మరీ ఇంత దుర్మార్గమా.?
తమిళ మీడియాని రెచ్చగొట్టారు. కన్నడ మీడియానీ రెచ్చగొట్టారు. బాలీవుడ్ మీడియానీ రెచ్చగొట్టారు. ఆయా సినీ పరిశ్రమల్లో ‘ఆర్ఆర్ఆర్’ పట్ల వ్యతిరేకత పుట్టేలా చేయడానికి కొన్ని దుష్టశక్తులు తమ శక్తి మేర కుట్రలు చేశాయ్.
అయితే, అవేవీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రభంజనాన్ని ఆపలేకపోయాయ్. సినిమా మీద విపరీతమైన హైప్ వచ్చింది. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయ్. తెరపైన బొమ్మ పడింది. సినిమాలో కంటెంట్ ఏమున్నదీ అన్నది వేరే చర్చ.
కానీ, అత్యంత దారుణమైన రీతిలో నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ప్రత్యేకించి ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి వ్యతిరేకంగా పని చేశారు. దాని వల్ల వాళ్లకు వచ్చే లాభమేంటీ.? అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నాయ్.
తెలుగు సినిమాపై ఇంత అక్కసు ఏల.?
సినిమా అంటే, అదొక కళాత్మకమైన వ్యాపారం. మన తెలుగు సినిమా, బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. భారతీయ సినిమాగా సంచలన విజయాన్ని అందుకుంటోంది.
ఇలాంటి తరుణంలో మన తెలుగు సినిమాని మన తెలుగు నేలపైనే సంహరించే కుట్రలు జరుగుతుండడం దురదృష్టకరం.

సినిమా బాగుంటే, జనం చూస్తారు. బాగోకపోతే జనం చూడరు. అంతేకానీ, ఇంతటి దుష్ప్రచారమా.? పైగా హీరోల మధ్య చిచ్చు రేపే ప్రయత్నమా.? కులాల కుంపట్లు రాజేసే కుటిల రాజకీయమా.? దేనికోసం ఇదంతా.!
Also Read: Pawan Kalyan హీరోయిజంపై ఎందుకీ ‘ఏడుపు’.!
రివ్యూల రూపంలోనూ ‘కుల పిచ్చి’ ప్రదర్శించి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తొక్కేద్దామనే ప్రయత్నాలు చాలానే జరిగాయ్.
సినిమాపై విషం చిమ్మేందుకు పుంఖాను పుంఖాలుగా నెగెటివ్ ప్రచారాలు షురూ అయ్యాయ్.. నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?