Papam Pasivadu YsJagan PawanKalyan.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ట్రోలింగ్’ ఆపడంలేదు.! ర్యాగింగ్ కొనసాగిస్తున్నారు.!
పబ్లిక్ మీటింగులో ‘దత్త పుత్రుడు’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు ‘పాపం పసివాడు’ అంటూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఈ మేరకు ఉదయాన్నే ఓ ట్వీటేసిన జనసేనాని, ఆ తర్వాత మరో ట్వీటేశారు. మొదటి ట్వీటులో పోస్టర్‌తో సరిపెడితే, రెండో ట్వీటులో కార్టూన్ షురూ చేశారు.!
Papam Pasivadu YsJagan PawanKalyan.. నోట్లో వేలు..
పాపం పసివాడు.. నోట్లో వేలు పెడితే కొరకలేడు.. అంటూ జనసేనాని ఓ ట్వీటేశారు. దానికి ఓ కార్టూన్‌ని జత చేశారు. అందులో చాలా విషయాలున్నాయి.
‘పింక్ కలర్ ఓన్లీ’ అంటూ ప్రస్తావించారు. ‘రచన, నిర్వహణ దర్శకత్వం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు.. ‘పాపం పసివాడు’ అనే టైటిల్‌తో కూడిన కార్టూన్‌కి.
Also Read: Free Hindu Temple.! హిందూ దేవాలయాలకి రాజకీయ గ్రహణం.!
‘ఎప్పుడో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది’ అని ప్రస్తావించడం ఒకింత ఆశ్చర్యకరం.
రెండు చేతుల్లోనూ సూట్ కేసులు, బ్యాగులు, చంకలో ఓ మూట.. ఇవన్నీ ఓ యెత్తు.. ‘మీ ఈజ్ టూ ఇన్నోసెంట్ అండ్ నైవ్’ అని పేర్కొనడం మరో యెత్తు.!