Parineeti Chopra Raghav Chadha.. మార్పు సహజం.! మార్పు లేకపోతే, మనిషికీ బండ రాయికీ తేడా ఏముంటుంది.?
ఆలోచనలు మారుతుంటాయ్.. అభిప్రాయాలు మారుతుంటాయ్.! ఒకప్పుడు వద్దనుకున్నదే.. ఇప్పుుడు ‘ముద్దు’గా మారొచ్చు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, ఒకానొక సందర్భంలో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra), ‘రాజకీయ నాయకుడ్ని మాత్రం పెళ్ళి చేసుకోను..’ అని తెగేసి చెప్పింది.
కట్ చేస్తే, ఆమెకు ఓ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు)తో పెళ్ళి ఖాయమైంది. ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అతనెవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా (Raghav Chadha).!
Parineeti Chopra Raghav Chadha.. ట్రోలింగ్.. వామ్మో.!
అప్పుడెప్పుడో.. చాలాకాలం క్రితం.. ‘రాజకీయ నాయకుడ్ని మాత్రం పెళ్ళి చేసుకోను..’ అని చెప్పిన పరిణీతి మాటల్ని కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

రాఘవ్ చద్దా (Raghav Chadha)తో ఎంగేజ్మెంట్‌కి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయగానే, పరిణీతి మీద ట్రోలింగ్ షురూ అయ్యింది.
అయితే, సినీ నటిగా పరిణీతి చోప్రా (Parineeti Chopra) ట్రోలింగ్ ఎన్నోసార్లు ఎదుర్కొంది. వాటిని ఆమె పరిగణనలోకి తీసుకుంటుందని అనుకోలేం.!
పోటెత్తిన విషెస్..
ట్రోలింగ్ సంగతి పక్కన పెడితే, సినీ రంగ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు.. పరిణీతి – రాఘవ జంటకు విషెస్ అందిస్తున్నారు.
Also Read: కృతి శెట్టి చెయ్యి పడితే మటాషే.! అంతేనా.?
ప్రత్యక్షంగా కొందరు, సోషల్ మీడియా వేదికగా మరికొందరు.. ఈ జంటను ఆశీర్వదిస్తున్నారు.

ఔను, కాదేదీ ట్రోలింగుకి అనర్హం.! ఇప్పుడే ఇలా వుంటే, పెళ్ళికి ఇంకెంత ట్రోలింగ్ గోల చేస్తారో.. సోకాల్డ్ నెటిజనం.!