Table of Contents
Pawan Jagan Sakshi Dopidi.. వైసీపీ హయాంలో సాక్షి పత్రికకి, సాక్షి న్యూస్ ఛానళ్ళకీ, అప్పటి ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచిపెట్టింది.
పైగా, అధికారికంగా.. అదీ ప్రభుత్వ ప్రకటనల రూపంలో.
అంతే కాదు, వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్ ముసుగేసి, వారికి ప్రజా ధనాన్ని దోచి పెట్టింది. అక్కడితో ఆగలేదు, వైసీపీ వాలంటీర్లతో సాక్షి పత్రికను కొనిపించింది అప్పటి ప్రభుత్వం.
సాక్షి పత్రికకి, సాక్షి న్యూస్ ఛానల్‌కీ.. వందల కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దోచిపెట్టారన్నది నిర్వివాదాంశం.
Pawan Jagan Sakshi Dopidi.. పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు చేయకూడదు..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసినట్లు, పవన్ కళ్యాణ్ ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడింది లేదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే, దాన్ని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ.
‘హరి హర వీర మల్లు’ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కోర్టులో ఓ కేసు విచారణ జరుగుతోంది.

కేసు వేసింది విజయ్ కుమార్ అనే మాజీ ఐఏఎస్. ఆయన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీ హయాంలో జగన్ చెప్పినట్టల్లా ఆడిన అధికారి ఆయన.
విజయ్ కుమార్, వేరే పార్టీ ముసుగేసుకుని.. తెరవెనుకాల వైసీపీ ఇచ్చిన స్క్రిప్టుకి అనుగుణంగా పవన్ కళ్యాణ్ మీద కోర్టుకెక్కారు.
ఏది అధికార దుర్వినియోగం.?
‘హరి హర వీర మల్లు’ సినిమా చూడమని అధికారుల్ని ఆదేశించారా.? ఆ సినిమా కోసం అర్థ రూపాయి అయినా ప్రజా ధనాన్ని ఖర్చు చేశారా.? అధికార దుర్వనియోగమెలా అవుతుందిది.?
పవన్ కళ్యాణ్‌కి ప్రధాన ఆదాయ వనరు నటన. సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్ హీరో పవన్ కళ్యాణ్. పైగా, ఉప ముఖ్యమంత్రి కాక ముందు ఒప్పుకున్న సినిమాల్నే ఆయనిప్పుడు పూర్తి చేస్తున్నారు.
గతంలో, పవన్ కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’ విడుదలైనప్పుడు, అధికారుల్ని సినిమా థియేటర్లలో మోహరించింది అప్పటి వైసీపీ సర్కార్. అదీ అధికార దుర్వినియోగమంటే.
మంత్రులు.. సినిమా రివ్యూలు..
మంత్రులుగా పని చేసినవారు, ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలకు నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంలో బిజీగా వుండేవారు అప్పట్లో.
Also Read: అందుకే, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.! ‘అతి’ చెయ్యకూడదు.!
నిజానికి, కూటమి అధికారంలోకి వచ్చాక, వాలంటీర్లతో వైసీపీ ప్రభుత్వం కొనిపించిన సాక్షి పత్రిక వ్యవహారాలు.. సాక్షి న్యూస్ ఛానల్‌కి ఇచ్చుకున్న ప్రభుత్వ ప్రకటనల లెక్కలూ తేల్చాలి.
గురివింద నైజాన.. తప్పులన్నీ తమ కింద పెట్టుకుని, వైసీపీ.. పవన్ కళ్యాణ్ సినిమాల మీద పడి ఏడవడమంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?