Pawan Kalyan Aadhya Selfie.. జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
కాకినాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అధికారుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan Konidala) గౌరవ వందనం స్వీకరించారు.
Pawan Kalyan Aadhya Selfie.. డిప్యూటీ సీఎం హెచ్చరిక..
సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించే పరిస్థితి లేదనీ, ఆడ పిల్లల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు.

మహిళా భద్రత విషయమై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందనీ, ఇప్పటికే ఈ విషయమై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
కుమార్తెతో డిప్యూటీ సీఎం సెల్ఫీ..
కాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమార్తె ఆద్య, తన తండ్రితో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తండ్రీ – కుమార్తెల మధ్య అనుబంధం, ఆప్యాయతని చూసి జనసైనికులు మురిసిపోతున్నారు. ఇలాంటి కుటుంబంపై వైసీపీ ఎలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగలిగిందనే చర్చ సాధారణ ప్రజానీకంలోనూ జరుగుతోంది.

ముఖ్యమంత్రి పదవిలో వుండీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అప్పట్లో అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మీద.
గడచిన ఐదేళ్ళలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై, అప్పటి అధికార వైసీపీ అత్యంత అసభ్యకరమైన రీతిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: మెగా ‘త్రిమూర్తులు’తో హరీష్ శంకర్.. ఆ ముహూర్తమెప్పుడో.!
విమర్శకు ప్రతి విమర్శ.. అని పవన్ కళ్యాణ్ ఏనాడూ అనుకోలేదు. తన కుటుంబంపై వచ్చిన ట్రోల్స్‌ని సహించారు.. అభ్యంతరకర వ్యాఖ్యల్నీ తట్టుకున్నారు.
