Cut Drawer MLA.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘కట్ డ్రాయర్ ఎమ్మెల్యే’గా అభివర్ణిస్తోంది తెలుగుదేశం పార్టీ.!
రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు, కానీ.. ఆ విమర్శల స్థాయి ఇంత నీఛానికి దిగజారిపోవాలా.? ఈ చర్చ జన బాహుళ్యంలో జరుగుతోంది.
ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఈ పైత్యం చూస్తున్నాం. ఒకరు ఎక్కువ.. ఇంకొకరు, ఇంకాస్త ఎక్కువ.. అంతే తేడా.! ఎవరూ తక్కువ కాదు.
Cut Drawer MLA.. నిక్కర్ మంత్రి..
మంత్రి నారా లోకేష్‌ని (Nara Lokesh) ఉద్దేశించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘నిక్కర్ మంత్రి’ అంటూ అభివర్ణించడంతో మొదలైందీ పైత్యం.
అసలు ఏం మాట్లాడుతున్నాం.? రాజకీయాల్లోకి ఎందుకొచ్చాం.? రాజకీయం అంటే ఏంటసలు.? ఇలా ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఎలా.? కడుపుకి అన్నం తింటున్నావా.? అశుద్ధం తింటున్నావా.? అని రాజకీయ నాయకుల్ని ఉద్దేశించి జనం ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎందుకు వస్తోంది.?
Mudra369
వైసీపీని మించి టీడీపీ, టీడీపీని మించి వైసీపీ.. ఇదిగో ఇలా ఈ పైత్యం పెరుగుతూ పోతోంది. ప్రజలేమనుకుంటున్నారన్నది ఈ రాజకీయ పార్టీలకు అనవసరం.
సోషల్ మీడియా వేదికగా ఈ స్థాయికి రాజకీయ పార్టీలు దిగజారిపోవడం అత్యంత హేయం.. అని జనం చర్చించుకుంటున్నారు.
గెలుపోటములు సహజం..
రాజకీయమన్నాక గెలుపోటములు సహజం. 2019లో టీడీపీ ఓడిపోయింది.. 2024లో వైసీపీ ఓడిపోయింది. అప్పట్లో టీడీపీ ఓడిపోయినప్పుడు వైసీపీ, ఇంకా దారుణంగా ఎగతాళి చేసింది.

ఇప్పుడు, ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక, వైసీపీని టీడీపీ యెటకారం చేస్తోంది. అంతే తేడా.! కాకపోతే, గతంలోలా ప్రస్తుతానికైతే బూతులు లేవు. ఆ ఒక్కటీ కాస్త బెటర్ అంశం.
ఎవరు ప్రజలకు ఎక్కువ సేవ చేస్తారు.? అన్న కోణంలో రాజకీయం వుండాలి తప్ప.. నిక్కర్ల గురించి, కట్ డ్రాయర్ల గురించీ చర్చించుకునే స్థాయికి రాజకీయం దిగజారిపోకూడదు.