Table of Contents
Pawan Kalyan Aavesham.. జన సేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు ఆవేశపడతారు.? ఎందుకంటే, జనం కష్టాలు తెలిసినోడు కాబట్టి.! ఆ జనమే తన కుటుంబం అనుకుంటాడు గనుక.!
సంపద వుంది.. ఆ సంపద కొందరి చేతుల్లోనే మురిగిపోతోంది.. ఆ సంపదకి అసలు యజమానులైన ప్రజలు మాత్రం బిచ్చగాళ్ళలా మారిపోతున్నారు.. సంక్షేమ పథకాల కోసం ఎదురుచూస్తున్నారు.
అభం శుభం తెలియని ఓ పదిహేనేళ్ళ కుర్రాడు అమర్నాథ్, తన సోదరిని కామాంధుల నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నిస్తే, ఆ కుర్రాడ్ని తగలబెట్టేసిన రాజకీయం గురించి ఏ నాయకుడైనా నవ్వుతూ ఎలా మాట్లాడగలడు.? మాట్లాడలేడు.!
Pawan Kalyan Aavesham.. ఆవేశపరుడు.. ఆలోచనపరుడు.. బాధ్యత కలిగినోడు.!
పవన్ కళ్యాణ్ నిఖార్సయిన నాయకుడు. ఈ ఘటన నుంచి మాట్లాడేటప్పుడు ఆవేశపడతాడు.! సంయమనంతో మాట్లాడలేడు. తన ఇంటి బిడ్డగా అమర్నాథ్‌ని అనుకుంటే, ఆవేశమే వస్తుంది.. సంయమనం రాదు.!
సుగాలి ప్రీతి అనే అమ్మాయి కామాంధులకు బలైపోతే, ఆ చిన్నారిని తన ఇంటి బిడ్డ అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్‌కే కాదు, ఏ నాయకుడికైనా.. దోషులు స్వేచ్ఛగా తిరుగుతుండడంపై గుండె రగిలిపోతుంది.
అభాగ్యుల బాధ.. తన బాధ అనుకుంటే.. ఆ బాధ వల్ల ఆవేశం వస్తుంది.. నిలదీయాలన్న కసి పెరుగుతుంది..
Mudra369
ఎన్నికల ప్రచారమంటే, వ్యక్తిగత రాజకీయ విమర్శలు కాదు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాజకీయ పార్టీలు మాట్లాడాల్సిన సందర్భం.
వాలంటీర్ల దగ్గర్నుంచి, ఉద్యోగుల వరకు.. నేరాలు, దోపిడీల దగ్గర్నుంచి సమాజంలో జరుగుతున్న అకృత్యాలు.. అన్నీ చర్చకు రావాలి. ప్రజల్లో చైతన్యం పెరగాలి.
ముఖ్యమంత్రి పైన దాడి అంటే..
ఏ పార్టీ వల్ల సమాజజంలో శాంతి భద్రతలు పెరుగుతాయి.? అన్నదే చర్చనీయాంశం కావాలి. ముఖ్యమంత్రి మీదనే హత్యాయత్నం జరిగేంతగా శాంతి భద్రతలు దిగజారిపోయాంటే, వైసీపీ పాలన ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.
తమ పాలనా వైఫల్యాల్ని కప్పి పుచ్చుకోవడానికి ‘ముఖ్యమంత్రిపై హత్యాయత్నం’ అనే ఘటనని సింపతీ గేమ్‌గా వైసీపీ మార్చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలదీశారు.
నాయకుడంటే పవన్ కళ్యాణ్‌లా వుండాలి.! గెలిస్తే సేవ చేస్తాను.. గెలవకపోయినా సేవ చేస్తాను.! మీ తరఫున నిలబడి, గట్టిగా మాట్లాడగలిగే జనసేన పార్టీని గెలిపించండని చెప్పడం జనసేనాని పవన్ కళ్యాణ్‌కి మాత్రమే చెల్లింది.
ప్రజలే మారాలి..
మారాల్సింది ప్రజలే.! సీఎం జగన్ మీద హత్యా యత్నం కంటే అమర్నాథ్ హత్య, సుగాలి ప్రీతిపై హత్యాచారం ఇంకా తీవ్రమైన అంశాలు.
గడచిన ఐదేళ్ళలో పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో జరిగిన హత్యలు, హత్యాచారాలు, ఇతర నేరాలపై ప్రజల్లో చర్చ జరగాలి. అభివృద్ధి అంటే ఏంటి.? రాజకీయం ఏంటి.? అన్న విషయమై ప్రజల్లో చర్చ జరగాలి.
జనసేనాని పవన్ కళ్యాణ్ తెనాలి ఎన్నికల ప్రచార సభ చెబుతున్నదిదే.! పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు.. నిజాయితీతో కూడిన ఆవేశం వెనుక, బలమైన ఆశయం వుంటుంది. అది సమాజానికి మేలు చేస్తుంది.