Table of Contents
Pawan Kalyan AP Roads.. అసలు రాజకీయం అంటే ఏంటి.? ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి.? సంక్షేమ పథకాలు ఎందుకు.? పరిపాలన ఎలా చేయాలి.?
ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు.. అని చెబుతుంటారు. కానీ, ఎన్నికల వేళ మాత్రమే, ‘ఓటరు దేవుడు’. ఆ తర్వాత, ఓటరు.. అదే, ప్రజలు, పాలకులకు బానిసలుగానే వుండాలి.
సంక్షేమ పథకాల పేరుతో పాలకులు బిచ్చం వేస్తోంటే, ఆ బిచ్చం కోసం ప్రజలు ఎగబడాలి. కొత్తగా, ‘బటన్ నొక్కడం’ అనే సరికొత్త పైత్యానికి పాలకుులు తెరలేపిన సంగతి తెలిసిందే.
కానీ, పరిపాలన అంటే వేరు.. రాజకీయం అంటే వేరు.. ప్రజా స్వామ్యమంటే వేరు. పరిపాలన ప్రజల బాగు కోసం.. రాజకీయం ప్రజల మేలు కోసం.. ప్రజాస్వామ్యం ప్రజలందరికోసం.
Pawan Kalyan AP Roads.. దశాబ్దాల నిర్లక్ష్యమిది..
దశాబ్దాల తరబడి, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఇంకా వున్నాయంటే, ఇప్పటిదాకా పాలకులు ఏం చేసినట్లు.? సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమిది.
జన సేన పార్టీ తీసుకొచ్చిన మార్పు, దశాబ్దాలుగా రోడ్డుకి నోచుకోని గిరిజన ప్రాంతాలకు, రోడ్లు పడటం. ఇది కదా మార్పు అంటే.!
ప్రాణ భయం వుందని అధికారులు హెచ్చరిస్తున్నా, గిరిజన గ్రామాలకు వెళ్ళి, అక్కడి సమస్యల్ని తెలుసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

సాధారణ గ్రామాల్లో రోడ్లు వేసి, పబ్లిసిటీ స్టంట్లు చేయడం కాదు.. దశబ్దాల వ్యధ తీర్చేలా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం గొప్ప. ఆ పని పవన్ కల్యాణ్ చేసి చూపించారు.
ఇది నా ఘనత కాదు, మా ప్రభుత్వ ఘనత.. అంటూ, వ్యక్తిగత పబ్లిసిటీని సైతం కోరుకోలేదు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసిన అభివృద్ధి అని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ, సోషల్ మీడియా వేదికగా జరిగిన అభివృద్ధి గురించి పేర్కొన్నారు.
ఇదీ పవన్ కళ్యాణ్ ట్వీటు సారాంశం..
‘‘గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం, లక్కవరం నుండి చీదిగోంది వరకు సహకారంతో దాదాపు ₹87.19 లక్షల వ్యయంతో 1.01 కి.మీ రహదారి నిర్మించడం జరిగింది.
ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపు 183 మంది గిరిజనులకు రహదారి సమస్య పరిష్కారం అయ్యింది.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, దాదాపు ₹1,000 కోట్ల నిధులతో – గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రారంభించిన అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా, ఇన్నేళ్లుగా సరైన రోడ్లు లేక వైద్యానికి, అవసరాలకు ఇబ్బందిపడుతున్న గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని చేయడం ద్వారా వారి ఇబ్బందులు తొలగించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారికి అభివృద్ధిని చేరువ చేస్తోంది.
ప్రభుత్వమంటే ఇదీ.. అభివృద్ధి అంటే ఇదీ..
183 మంది గిరిజనులకు బతుకునిస్తుంది ఈ రోడ్డు. సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిపోయిన పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం.
కిలో మీటర్ రోడ్డు కోసం 87 లక్షలు వెచ్చించడానికి ఇష్టపడని ప్రభుత్వాలు ఇన్నాళ్ళూ వుండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రోడ్లు వచ్చాయంటే, అభివృద్ధి వచ్చినట్లే.

అభివృద్ధి సంగతి తర్వాత, ప్రాణాల మీదకు వచ్చినప్పుడు, ఆసుపత్రికి వెళ్ళి ప్రాణం నిలుపుకోవడానికైనా, రహదారి మార్గం వుండాలి కదా.! ఉపాధి అవకాశాలకీ ఈ రోడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
గిరిజన సంక్షేమం అంటే, దానికి అసలు అర్థం ఇది. అందుకే, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎంత ముఖ్యమన్నదానిపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు.. ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
ప్రభుత్వమంటే ఇలా వుండాలి. అభివృద్ధి అంటే ఇలా జరగాలి. ప్రజాస్వామ్యం అంటే ఇదీ.