Vakeel Saab ట్రైలర్: ఏం చెప్పారు.? ఏం చేశారు.?

 Vakeel Saab ట్రైలర్: ఏం చెప్పారు.? ఏం చేశారు.?

Vakeel Saab Trailer Review Mudra369

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్ధమయిన విషయం విదితమే. తాజాగా సినిమా ట్రైలర్ (Vakeel Saab Trailer Review Mudra369) విడుదలయ్యింది. సినిమా థియేటర్లలో ప్రత్యేకంగా ఈ ట్రెయిలర్ విడుదల చేశారు.

‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజయ్యాకనే పెద్ద ప్రభంజనాన్ని చూశాం. అంతకు మించిన ప్రభంజనం కనిపిస్తోందిప్పుడు. ట్రెయిలర్ చూస్తే, అందులో చాలా ప్రత్యేకతలున్నాయి. కోర్టు డ్రామానే ఎక్కువగా కనిపించింది. బాలీవుడ్ సినిమా ‘పింక్’ రీమేక్ ఇది. అక్కడ అమితాబ్ బచ్చన్ నటన ఆ సినిమాకి హైలైట్ అయ్యింది.

తమిళంలో ‘నేర్కొండ పార్వాయ్’ (nerkonda Paarvai) పేరుతో తెరకెక్కగా, ఇందులో అజిత్ (Thala Ajith Kumar) కీలక పాత్రలో కనిపించారు. తెలుగులో ‘వకీల్ సాబ్’గా (Vakeel Saab) రీమేక్ అయ్యింది. వేణు శ్రీరామ్ దర్శకుడు.

కోర్టు డ్రామా పండించడంలో అమితాబ్ (Abitaabh Bachhan), అజిత్.. ఇద్దరూ తమదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకరితో ఒకర్ని పోల్చలేం ఇలాంటి సినిమాల విషయంలో. పవన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి చాలా చాలా స్పెషల్. ‘వకీల్ సాబ్’ సినిమాని కమర్షియల్ కోణంలో చూడలేం.

ట్రెయిలర్ విషయానికొస్తే.. తమన్ అందించిన నేపథ్య సంగీతం.. మళ్ళీ మళ్ళీ ట్రెయిలర్ చూడాలనిపించేలా చేస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేసినట్టున్నారు. కంటెంట్ చాలా రిచ్ అనేలా వుంది ట్రైలర్.

ప్రకాష్ రాజ్ (Prakash Raj) పాత్ర పేరు ‘నందా’. దాంతో, పవన్ ‘నందాజీ’ అనగానే, ‘బద్రి’ సినిమా చాలామందికి గుర్తుకొచ్చింది. ట్రెయిలర్ వరకూ అయితే నివేదా థామస్ ఎక్కువ స్కోర్ చేసింది.. అంజలి, అనన్యలతో పోల్చితే. ‘ఏం చెప్పారు? ఏం చేశారు?’ అంటూ పవన్ సంధించిన ఓ ప్రశ్న ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.

పవన్ గత సినిమాలతో పోల్చితే, ఈ ‘వకీల్ సాబ్’ చాలా చాలా స్పెషల్. తెలుగు వెర్షన్ కోసం చాలా మార్పులు చేశారనే ప్రచారం జరిగినా.. ఫ్లేవర్ ఎక్కడా దెబ్బ తినలేదని ట్రెయిలర్ చూస్తే (Vakeel Saab Trailer Review Mudra369) అర్థమవుతుంది.

మరి, ‘వకీల్ సాబ్’ (Vakeel Saab Review) సినిమాలో కన్పించే ఆ కమర్షియల్ మార్పులెలా వుంటాయో తెలియాలంటే ఏప్రిల్ 9 వరకు వేచి చూడాల్సిందే.

Digiqole Ad

Related post