Pawan Kalyan Bro Controversy..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరు.! ఒక్కరే మనిషి.! కానీ, రెండు కోణాలు. ఒకటి సినిమా నటుడు.. ఇంకొకటి రాజకీయ నటుడు.!
రాజకీయం బాధ్యత.. సినిమా అనేది ఇష్టం.! జనసేన పార్టీకి ఆర్థిక జవసత్వాలు అందించేందుకోసమే సినిమా.. అని పదే పదే పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.
సినిమాలు చేస్తున్నారు.. తద్వారా వచ్చిన డబ్బుల్ని రాజకీయాల కోసం ఖర్చు చేస్తున్నారు.! ఇది అందరికీ తెలిసిన విషయమే.
Pawan Kalyan Bro Controversy.. నేనే వదిలేశా.. పవన్ కళ్యాణ్
‘సినిమా కోసం కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా.. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పా.. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌తో సినిమాని వదిలేశా..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేనాని.!
‘నేనే నా సినిమాని వదిలేశాను. మీరెందుకు ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. మనల్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు..’ అంటూ పార్టీ శ్రేణులకు జనసేనాని దిశానిర్దేశం చేశారు.

టీవీ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి తప్ప, సినిమా గురించి కాదన్నారు జనసేనాని.
వాళ్ళు తిడతారు.. నాకేమీ చిల్లు పడదు..
‘వాళ్ళు చేసే వెధవ పనులకి నేను వాళ్ళని విమర్శిస్తాను. సమాధానం చెప్పలేక వాళ్ళు ఎదురుదాడి చేస్తారు. నన్ను తిడతారు. నాకేం నష్టం లేదు..’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.
‘వాళ్ళు తిడితే నాకేమీ చిల్లు పడదు. మీరైతే ఓ మాట అని ఊరుకోండి చాలు సినిమా గురించి.. నా గురించి..’ అని చెప్పిన జనసేనాని, ‘ప్రజా సమస్యలపై బాధ్యతతో వ్యవహరించండి’ అని సూచించారు.
Also Read: Madonna Sebastian Tollywood.. అందగత్తె.! పాటగత్తె కూడా.!
వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, మిస్ అవుతున్న మహిళలు, చిన్న పిల్లల గురించి చర్చ జరగాలని జనసేనాని అభిప్రాయపడ్డారు.
‘బ్రో’ సినిమా రాజకీయ వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా, మంత్రి అంబటి రాంబాబు.. నానా యాగీ చేశారు.
సినిమాలోని శ్యాంబాబు అనే పాత్రని తన మీద సెటైర్ వేయడానికే సృష్టించారంటూ మంత్రి అంబటి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.!