Pawan Kalyan Cinema Ban.. సినిమాలు పవన్ కళ్యాణ్‌కి బతుకు దెరువు.! అలాగని, పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రాజకీయాల్లో వున్నారాయాన.!
రాజకీయమంటే, కొంతమందికి బతుకు దెరువు. సంపాదనా మార్గం కూడా.! కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదు. సినిమాల్లో సంపాదించింది, తీసుకెళ్ళి రాజకీయాల్లో పెడుతుంటారు.
రాజకీయమంటే ప్రజా సేవ.. అని బలంగా నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ సంపాదించిన మొత్తంలో కొంత భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు.
మిగతా సంపాదనని, పవన్ కళ్యాణ్ ఎక్కువగా విరాళాల కోసమే వినియోగిస్తుంటారు.
మొన్నామధ్య విజయవాడ సహా హైద్రాబాద్.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్.
ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ చేసిన సాయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే, అలా సినిమా ద్వారా ఆయనకు దక్కే రెమ్యునరేషన్ నుంచి కొంత భాగం, తిరిగి ప్రజల్లోకే వెళుతుందన్న బలమైన నమ్మకం.. ఆ ప్రజలకే వుంది.
మరి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం ఆపేస్తేనో.? పవన్ కళ్యాణ్ సినిమాల్ని రిలీజ్ కాకుండా చేస్తేనో.? ప్చ్.. ఇవన్నీ జరిగే పనులు కావు.!
పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఆపడం ఎవరి తరమూ కాదు.! తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు, మీడియా మైకుల ముందుకొచ్చి, పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఆపేస్తామంటున్నారు.
సినిమాల వరకూ ఎందుకు, పవన్ కళ్యాణ్ సినిమాల తాలూకు పోస్టర్లు ఆపగలరేమో ట్రై చేసి చూడండి.. అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ రాజకీయ నాయకులకు సవాల్ విసురుతున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఒక్కటే వుంది.. అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించే సినిమా ఏది.? అన్నదానిపై స్పష్టత లేదు.
