Pawan Kalyan Deepavali Subhakankshalu.. జన సేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ప్రజల్ని అప్రమత్తం చేశారు.
‘ఈ నరకాసులు మారీచుల్లాంటివారు..’ అని పేర్కొంటూ, అలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్ని హెచ్చరించారు.
సహజంగానే, పవన్ కళ్యాణ్ సూచన.. సదరు మారీచుల్లాంటి నరకాసురులకు ఒకింత ఆగ్రహం తెప్పించింది. పవన్ కళ్యాణ్ మీద, రంకెలు వేస్తున్నారు వాళ్ళంతా.
Pawan Kalyan Deepavali Subhakankshalu.. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
దీప కాంతులతో శోభాయమానంగా… సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండగ దీపావళి.
తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
మన భారతదేశంలో చేసుకొనే ప్రతీ పండగకీ ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది.
చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాము.
దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు.
రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు.
కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి.
ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
రాజకీయమంటే ప్రజా సేవ.. అధికారం అంటే బాధ్యత.. అని బలంగా నమ్ముతారు గనుక, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ‘మారీచుల్లాంటి నరకాసురుల’ గురించి పవన్ ప్రస్తావించారు.
ఇందులో తప్పేముంది.? గుమ్మడికాయల దొంగ.. అనగానే, భుజాలు తడిమేసుకోవడమెందుకు.?
పవన్ కళ్యాణ్ మీద మీడియా ముసుగులో రంకెలేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు, నీలి కూలి మీడియా సంస్థల యజమానులు కూడా తమను తాము నరకాసురులమని డిక్లేర్ చేసుకున్నట్లే కదా.?
