పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ సినిమాని రెండు పార్ట్లులుగా రిలీజ్ చేస్తారంటూ ఈ మధ్య ఓగాసిప్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఒక్క పార్ట్‌కే ఇంత టైమ్ తీసుకుంటే, ఇక రెండో పార్ట్ అంటే ఇంకెంత ఆలస్యమవుతుందో.! అంటూ డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయ్.
ఈ విషయమై నిర్మాత ఎ.ఎమ్ రత్నం తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారాయన.
Pawan Kalyan.. ఆలస్యానికి కారణం ఇదే..
షూటింగ్ జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ కోవిడ్ బారిన పడ్డారు. ఆ కారణంగా చాలా రోజులు షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చిందని ఎ.ఎమ్ రత్నం చెప్పారు.
పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న సినిమా ఇది. సో, సెట్స్ వేయాలి.. ఇంకా చాలా చాలా పనులుంటాయ్. అదీ ఆలస్యానికి ఓ కారణమే అని తెలిపారు.
అన్నింటికీ మించి ఈ సినిమా మొదట అనుకున్నప్పుడే, నార్త్‌ని గట్టిగా టార్గెట్ చేశారట. దాంతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని డిసైడ్ అయ్యారట.
‘ఖుషీ’ టైమ్‌లోనే నార్త్ టార్గెట్..
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్. ఆ టైమ్‌లోనే నార్త్‌ని కూడా టార్గెట్ చేశారట. కానీ, కుదరలేదట. దాంతో ‘హరి హర వీరమల్లు’ కోసం ఈ సారి గట్టిగా టార్గెట్ చేశారట.
ఈ సినిమా తెరకెక్కడానికి చాలా టైమ్ పడుతుందని ముందుగానే అనుకున్నామనీ, అయినా ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యం మేం ఊహించిన స్థాయి ఆలస్యం కాదని నిర్మాత ఎ.ఎమ్.రత్నం అన్నారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఔరంగజేబు’ పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారు.
అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దసరా కానుకగా ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.