Table of Contents
Pawan Kalyan HBD India.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి, ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఆ సేతు హిమాచలం.. అనగా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, సినీ ప్రముఖులు.. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌కి జన్మ దిన శుభాకాంక్షలు చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా.. పలువురు కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్ అందించారు.
అలాగే, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. పవన్ కళ్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినవారిలో వున్నారు.
Pawan Kalyan HBD India.. తెలుగునాట ప్రభంజనం..
తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, టాలీవుడ్ సినీ ప్రముఖుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.?
ఒక్కమాటలో చెప్పాలంటే, సోషల్ మీడియా, ‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్’ నినాదాలతో హోరెత్తిపోయిందనడం అతిశయోక్తి కాదేమో.

2024 ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పవన్ కళ్యాణ్, జన సేన పార్టీకి అందించిన విజయం, తద్వారా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం తెలిసిన విషయాలే.
జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్‌ని, ‘యే పవన్ నహీ.. యే ఆంధీ హై..’ అంటూ, పవన్ కళ్యాణ్‌ని తుపానుతో పోల్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
సనాతన ధర్మ పరిరక్షణ..
సినీ, రాజకీయ రంగాల్లో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలు, సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఓ వైపు, సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకు దక్కిన గుర్తింపు ఇంకో వైపు.
వెరసి, పవన్ కళ్యాణ్ నామ జపం.. దేశవ్యాప్తంగా మార్మోగిపోయిందనడం అతిశయోక్తి కాదు.. ఆయన పుట్టిన రోజున.
ఈ స్థాయిలో ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకుడిపైన అయినా శుభాకాంక్షలు వెల్లువెత్తాయా.? అన్న చర్చ జరుగుతుండడం గమనార్హం.
ఎలివేషన్స్.. వేరే లెవల్.!
మామూలుగా, ప్రముఖులకు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు, నామ మాత్రంగా వుంటాయి. కానీ, పవన్ కళ్యాణ్‌కి ఒక్కో ప్రముఖుడు ఎలివేషన్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
నిజంగానే, ఈ ఏడాది పుట్టిన రోజు చాలా చాలా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్‌కి. పిఠాపురం ఎమ్మెల్యేగా, ఏపీ డిప్యూటీ సీఎంగా అత్యంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఓ వైపు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అప్డేట్స్.. ఇంకో వైపు, పవన్ కళ్యాణ్ మీద శుభాకాంక్షల వెల్లువ.. వెరసి, ఇదొక సరికొత్త చరిత్ర.. అని చెప్పుకోవాలేమో.!