Table of Contents
Pawan Kalyan HHVM Trending.. అభిమానులంటే, పవన్ కళ్యాణ్‌కి లఎంత అభిమానమో తెలుసు కదా.!
అందుకే, పవన్ కళ్యాణ్‌కీ, ఆయన అభిమానులకీ మధ్య ‘ఇజం’ అనే బాండింగ్ ఎప్పుడూ వుంటుంది.
భారతీయ సినీ పరిశ్రమలోనే కాదు, ప్రపంచ సినీ పరిశ్రమలోనే ఓ నటుడి పేరుతో ‘ఇజం’ మొదలైంది.. పవన్ కళ్యాణ్ విషయంలోనే.
‘పవనిజం’ అని పేరు పెట్టుకున్నారు ఆ ‘ఇజం’కి పవన్ కళ్యాణ్ అభిమానులు.! ఆ పవనిజం, సమాజంపై బాధ్యతను గుర్తు చేస్తుంటుంది అభిమానులకి.
అదే ‘పవనిజం’, అభిమానులపై తనకున్న బాధ్యతని పదే పదే పవన్ కళ్యాణ్‌కీ గుర్తు చేస్తుంటుంది.
Pawan Kalyan HHVM Trending.. పబ్లిసిటీకి దూరంగా పవన్ కళ్యాణ్..
పని చేయడమే నాకు తెలుసు.. ఫలితం, ఆ పెరుమాళ్ళకెరుక.. అని చెబుతుంటారు పవన్ కళ్యాణ్. పని పట్ల పవన్ కళ్యాణ్ అంకిత భావం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
సినిమా అయినా, రాజకీయాలు అయినా.. పవన్ కళ్యాణ్ అదే కమిట్మెంట్ ప్రదర్శిస్తారు.. అదే బాధ్యతతో వుంటారు.
కాకపోతే, సమాజం పట్ల బాధ్యత ఎక్కువ కావడంతో, సినిమాకి కాస్త తక్కువ సమయం కేటాయించక తప్పదు.
సినిమాల్ని వదిలేసి, రాజకీయాల్లోనే కొనసాగాలంటే.. కుటుంబ పోషణ కష్టం.. ఇది పవన్ కళ్యాణ్ చెప్పే మాట. ఔను, పవన్ కళ్యాణ్‌కి ఆదాయం వచ్చేది సినిమా నుంచే కదా.!
సినిమా ప్రమోషన్లంటే ఒకింత నచ్చదుగానీ..
‘సినిమాని ప్రమోట్ చేయాలంటే.. ఎందుకో నచ్చదు. గొప్పగా వుంటుందని.. సినిమాని ప్రమోట్ చేశాక.. అది బాగోకపోతే, మీరే తిడతారు’ అని పవన్ కళ్యాణ్ తాజాగా, అభిమానుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అదీ నిజమే.! కానీ, ‘హరి హర వీర మల్లు’ సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, ‘బద్దలుగొట్టెయ్యండి’ అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, కండిషన్స్ అప్లయ్.. ఇక్కడ కూడా.! ‘సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. మా కష్టం మీకు నచ్చితే, బద్దలుగొట్టెయ్యండి’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం.
బద్దలుగొట్టెయ్యాల్సిందే..
‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే డైలాగ్ ఎంత ట్రెండింగ్.. అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడేమో, ‘బద్దలుగొట్టెయ్యండి’ అనే డైలాగ్ అంతలా ట్రెండింగ్ అవుతోంది.
Also Read: ‘థగ్ లైఫ్’ రివ్యూ.! మణిరత్నం మార్క్ ఏదీ.? ఎక్కడ.?
పవన్ కళ్యాణ్ అంటేనే ట్రెండింగ్.! ఇంతకీ, ‘హరి హర వీర మల్లు’ బాక్సాఫీస్ పాత రికార్డుల్ని బద్దలుగొట్టేస్తుందా.? వేచి చూడాల్సిందే.