Pawan Kalyan Janasenani: ‘వకీల్ సాబ్’, ‘బీమ్లానాయక్’.. రెండూ చాలా చాలా ప్రత్యేకమైన సినిమాలు. ‘అత్తారింటికి దారేది’ కూడా అంతే.
పవన్ కళ్యాణ్‌ని తొక్కేయడానికి ‘కంకణం’ కట్టుకున్న కొన్ని శక్తులు పన్నిన కుట్రలను ఈ సినిమాలు అధిగమించాయి.
పవర్ స్టార్.. ఆ పేరులో ఓ ప్రభంజనం వుంది. అందుకే, వేరే ఏ హీరోకీ లేని విధంగా పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకమైన అభిమానులంటారు.
అభిమానం అంటే దాన్నొక మతంలా, ఓ ఇజంలా భావించడం పవన్ కళ్యాన్ విషయంలోనే జరుగుతుంటుంది. ఔను, పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఆ ‘పవనిజం’ని పాటిస్తుంటారు.
కేవలం పవన్ కళ్యాణ్ చెప్పే సినిమాటిక్ డైలాగులో, సినిమాల్లో వేసే డాన్సులో, సినిమాల్లో చేసే ఫైట్స్ వంటివో.. వాటి కారణంగా పవన్ కళ్యాణ్ పట్ల అభిమానులు ఇంతలా ఆకర్షితులైన ఆయన్ని అభిమానించడాన్ని ‘ఇజం’గా భావించడంలేదు.
Pawan Kalyan Janasenani.. ఏముంది పవన్ కళ్యాణ్‌లో అంత ప్రత్యేకత.?
పవన్ కళ్యాణ్ అంటే నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం.. అన్న భావన అభిమానుల్లో వుంటుంది. అందుకే ఆయన్ని ఆరాధిస్తుంటారు.. అభిమానం కంటే ఎక్కువ ఈ ఆరాధనా భావం.
‘పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఆలోచిస్తాడు..’ కాబట్టే, ఆయన అభిమానులు, ఆయన కోసం జనసైనికులుగా మారారు.!
ప్రజల్ని పల్లకీ ఎక్కించడమే జనసేన రాజకీయం.. అని జనసేనాని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారు.
కానీ, ఎలాగైతే పవన్ కళ్యాణ్ సినిమాల్ని తొక్కేయాలని చూస్తుంటారో కొందరు, ఆ కొందరు పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా తొక్కేసేందుకు.. చిత్ర విచిత్రమైన అంశాల్ని తెరపైకి తెస్తుంటారు.
పవన్ చేతి వేళ్ళకున్న ఉంగరాలిప్పుడు చర్చనీయాంశమయ్యాయి. గతంలో పవన్ కళ్యాణ్ పంచె కట్టు మీద విమర్శనాత్మక కథనాలు కనిపించేవి. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఉంగరాల గురించి చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
చర్చ జరగాల్సింది ఉంగరాల గురించి కాదు.!
‘మీ పాలన అద్భుతంగా వుంటే, రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.?’ అన్నది పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న.
దీనికి సమాధానం చెప్పడం చేతకానోళ్ళు, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఉంగరాల గురించి విశ్లేషిస్తారు. వాటినే జనం కూడా ఎంకరేజ్ చేస్తారా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
Also Read: సాయం చేసేవాడు దేవుడైతే.. నువ్వే ఆ దేవుడివి పవన్ కళ్యాణ్.!
పవన్ కళ్యాణ్ వేష భాషల గురించి కాదు చర్చ జరగాల్సింది.. పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో ఏ మార్పు గురించి మాట్లాడుతున్నాడని. పవన్ కళ్యాణ్, జనం కోసం ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడన్నదానిపై చర్చ జరగాలి.