Table of Contents
Pawan Kalyan Janasenani Vishwanarudu.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినిమా నటుడిగా కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడన్నది అందరికీ తెలిసిన విషయమే.
రోజుకి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వరకూ తనకు వస్తుందని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బహిరంగంగానే చెప్పారు. ఈ రోజుల్లో ఇలా చెప్పాలంటే గట్స్ వుండాలి.
ముఖ్యమంత్రులుగా వుండి, వందల కోట్లు.. వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ, సొంత కార్లు లేవని చెప్పే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో, ప్రజా ప్రతినిథి కాకుండానే.. తన సంపాదన విషయంలో స్పష్టతనిస్తున్నారాయన.
Pawan Kalyan Janasenani Vishwanarudu.. స్వార్జితాన్ని పంచిపెడుతున్న విశ్వనరుడు..
రాజకీయంగా వెన్నుపోట్లు పొడవలేదు.. పదవుల కోసం ఎవర్నీ చంపించలేదు.. అలాంటి రాజకీయ నరకాసురుడైతే కాదు పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan).
స్వార్జితాన్ని జనం కోసం ఖర్చు చేస్తున్నారు జనసేనాని. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా బాగా ఆడితే.. ఆయనకు దాని వల్ల లాభం వస్తే, అలా వచ్చిన సొమ్ముని జనం కోసమే ఖర్చు చేస్తాడు.

రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటాడు కదా.? లాభ నష్టాలతో పనేంటి.? అంటే, సినిమాకి నష్టమొస్తే.. ఆ నష్టాన్ని భరించే హీరో పవన్ కళ్యాణ్.
కుల రాజకీయ రక్కసుల నడుమ..
అధికారంలోకి వస్తే తమ కులానికి చెందినవారికే పదవులు కట్టబెట్టుకునే కుల రాక్షసులు రాజకీయాల్లో రాజ్యమేలుతున్నారు.
కులాల ప్రస్తావన లేని రాజకీయం ఈ రోజుల్లో అసాధ్యం. కులాల్ని కలిపే రాజకీయమే జనసేన చేస్తుందని జనసేనాని (Janasenani Pawan Kalyan) చెబుతుంటారు.
ఖచ్చితంగా కులాల ప్రస్తావన వస్తుంది. మతాల ప్రస్తావన వస్తుంది. కులాలకతీతంగా సమాజం బాగు ఆలోచించమని చెబుతారాయన.

అలాగే, కులుం కూడా బాగుపడాలన్న కోణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. అని కూడా పిలుపునిస్తుంటారు పవన్ కళ్యాణ్. ఇందులో తప్పేముంది.?
సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే సోకాల్డ్ రాజకీయ రాక్షసత్వం నుంచి, అభివృద్ధి వైపు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తుంటారు జనసేనాని (Jana Sena Party Chief Pawan Kalyan).
ఆవేశం వస్తుంది.. రాకుండా ఎందుకు వుంటుంది.?
ఔను, పవన్ కళ్యాణ్‌కి ఆవేశం వస్తుంది. రాదా మరి.? పదో తరగతి విద్యార్థి రాక్షస మూక పాశవిక దాడిలో కాలి బూడిదైతే.. ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నప్పుడు నాయకుడికి ఆగ్రహం, ఆవేశం, ఆవేదన కాక ఇంకేమొస్తాయ్.?
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
పాత్రికేయాన్ని వ్యభిచారం కంటే దిగువస్థాయికి లాగేసి, డబ్బులు వెదజల్లి తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారు.
మరీ అభ్యంతరకరమైన, జుగుప్సాకరమైన రీతిలో దారుణ హత్యలకు గుండెపోటు ముసుగు కప్పుతున్న కుహనా రాజకీయాలపై జనసేనాని (Jana Senani Pawan Kalyan) యుద్ధం చేస్తున్నారు.

అమ్ముడుపోయిన కలాలకి పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనీ, కష్టంగానే వుంటుంది.! నిజాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తున్నాడు మరి.! చంపేసి డెడ్‌బాడీని డోర్ డెలివరీ చేయడమేంటని నిలదీస్తున్నాడు.. అది తప్పెలా అవుతుంది.?
ఒక్కసారి పాత్రికేయ వ్యభిచారం నుంచి బయటకొచ్చి, నిఖార్సయిన పాత్రికేయం చేస్తే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేస్తున్న రాజకీయమేంటో అర్థమవుతుంది.