Shobha Shetty: ‘షో’ ముగించేసిన బిగ్ బాస్.!
Shobha Shetty
BB7Telugu Shobha Shetty Eliminated.. అరరె.! శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయిందే.! అయితే, ఎవడికేంటి.? ఏదో అనుకుంది, ఇంకోటేదో అయ్యింది.!
ఛత్.. ఆ ఛాన్సే లేదు.! అక్కడంతా స్క్రిప్ట్ వ్యవహారమే.! ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలన్నది, బిగ్ బాస్.. అప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటాడంతే.
ఓటింగూ లేదు.. ఇంకేమీ లేదు.! వున్నాగానీ, దానికి విలువే లేదు.! ఈ సీజన్ (Bigg Boss Telugu Season 7) విషయంలోనే కాదు, గత సీజన్లలోనూ జరిగింది ఇదే.!
BB7Telugu Shobha Shetty Eliminated.. మోనిత అలియాస్ శోభా శెట్టి..
వాస్తవానికి శోభా శెట్టి (Shobha Shetty) అనే పేరు కంటే, మోనిత అనే పేరు బాగా పాపులర్.! టీవీ సీరియల్స్ రెగ్యులర్‌గా చూసేవారికి, ‘మోనిత’ని కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
‘మోనిత’ పాత్రలో ఒదిగిపోయిన శోభా శెట్టి, బిగ్ బాస్ రియాల్టీ షోతోనే, అసలు సిసలు పేరుతో పాపులర్ అయ్యిందని చెప్పడంలో వింతేమీ లేదు.

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్ వరకూ తీసుకుంటే, శోభా శెట్టి కంప్లీట్ ఎంటర్టైనర్.! విలనిజం చూపించింది.. డైనమిజం ప్రదర్శించింది. చేయాల్సిందంతా చేసింది.
గెలుపు ముంగిట బోర్లా పడి..
ఏమయ్యిందోగానీ, ఫైనల్ వీక్ ముందర హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది శోభా శెట్టి. అమర్ దీప్, శివాజీ, యావర్, అర్జున్, ప్రియాంక, ప్రశాంత్.. వీళ్ళెవరూ శోభా శెట్టి కంటే తోపులేం కాదు.!
Also Read: మె‘గాసిప్’.! ‘ఉప్పెనం’త ప్రేమ.! బేబమ్మా.. ఏంటి కథ.?
పాపం.. శోభా శెట్టి అభిమానులు ఈ విషయమై తెగ గుస్సా అవుతున్నారు. అలాగని, శోభా శెట్టి గొప్ప ‘ప్లేయర్’ ఏం కాదు బిగ్ బాస్ రియాల్టీ షోలో.! కాకపోతే, మిగతావాళ్ళ కంటే కాస్త బెటర్.!
ఫైనల్‌గా ఇదొక రియాల్టీ షో (Bigg Boss Telugu Season 7) కాదు.! పేరుకే రియాల్టీ షో.. వాస్తవానికి, ఇదొక డ్రామా.! ఆ డ్రామాలో శోభా శెట్టి పాత్ర ఇలా ముగిసిందంతే.!