Pawan Kalyan Lok Sabha.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోక్ సభకు పోటీ చేస్తారట.!
ఓ అసెంబ్లీ నియోజకవర్గం, అదే సమయంలో లోక్ సభ నియోజకవర్గం.. ఇలా రెండు చోట్లా పోటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.!
అయినా, ఎన్ని ప్రచారాలు జరుగుతాయ్ జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి.?
2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండూ అసెంబ్లీ నియోజకవర్గాలే. ఒకటి గాజువాక, ఇంకోటి భీమవరం.!
రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి, రెండు చోట్లా జనసేనాని ఓడిపోయారు.! పవన్ కళ్యాణ్ ఎలా ఓడిపోయారన్నది ఇప్పటికీ మిస్టరీనే.. ఆ రెండు నియోజకవర్గాల్లో.!
Pawan Kalyan Lok Sabha.. రాజకీయం అంటే ఇదీ..
రాత్రికి రాత్రి అడ్డగోలుగా కరెన్సీ నోట్లు పంచేశారు రాజకీయ ప్రత్యర్థులు ఈ రెండు నియోజకవర్గాల్లో. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
రాజకీయం అంటే, ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన సరిపోదు. డబ్బుతో కూడుకున్న పని.!
కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు కోట్లు ఖర్చు చేసే పవన్ కళ్యాణ్, ఎన్నికల్లో గెలవడానికి మాత్రం ఖర్చు చేయరు. అదే అసలు సమస్య.
ఇక, జనసేనాని అసెంబ్లీకి వెళ్ళినా, లోక్ సభకు వెళ్ళినా.. పెద్దగా తేడీ ఏమీ వుండదు.
అసెంబ్లీలో వాయిస్ బలంగా వినిపిస్తారా.? లోక్ సభలో వాయిస్ బలంగా వినిపిస్తారా.? అన్నదే తేడా. ఎక్కడ ఆయన వాయిస్ వినిపించే అవకాశం వచ్చినా, అది బలంగానే వుంటుంది.
Also Read: కారు లాంటి విమానం.! ఎగిరే ‘విద్యుత్’ ట్యాక్సీ.! వచ్చేస్తోంది.!
నిర్ణయం తీసుకోవాల్సింది జనసేనాని పవన్ కళ్యాణ్. అసలంటూ నిర్ణయం జరిగాక, అది దాచుకునే విషయం కాదు కదా.!
ఈలోగా మీడియాకి తుత్తర ఆగడంలేదు.! ట్రోల్ చేయాలనుకునేవారిదేమో ‘అతి మూత్ర సమస్య’.! ఏం చేయలేం.! మీడియా, రాజకీయ ప్రత్యర్థులు, పెయిడ్ బ్యాచ్.. వీళ్ళ అతి సంగతి సర్వసాధారణమే.
కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులమని చెప్పుకునే కొందరు సైతం, ప్రత్యర్థుల ట్రాప్‌లో పడిపోతున్నారు.. అయోమయానికి గురవుతున్నారు. నాయకుడ్ని కార్యకర్తలు శంకించే పరిస్థితి అస్సలు రాకూడదు ఏ రాజకీయ పార్టీలోనూ.!