Pawan Kalyan Maata Vinali.. ‘మనకి పవర్ ఎక్కడుంది.? గెలిచాక, మాట్లాడుకుందాం’ అంటూ, ‘పవర్ స్టార్’ అనే ట్యాగ్‌ని వదిలేసుకున్నారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళ క్రితం.
తాత్కాలికంగా వదులుకున్నది ‘పవర్ స్టార్’ అనే టైటిల్ మాత్రమే. కానీ, ఆయనలో ‘పవర్’ ఎప్పుడూ తగ్గలేదు. అధికారంలో వున్నా, లేకపోయినా.. పవన్ కళ్యాణ్ ‘పవర్’ అలానే వుంటుంది.
ఇప్పుడాయన, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ‘పవర్’ అంటే అహంకారం కాదు, బాధ్యత.. అని నిరూపిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
‘హరి హర వీర మల్లు’ సినిమా విడుదలకి ఆటంకాలు కలిగించేలా, సినీ పరిశ్రమలో ఓ వర్గం, ‘థియేటర్ల బంద్’ అంటూ, ఆడిన నాటకం బెడిసికొట్టింది.
Pawan Kalyan Maata Vinali.. కుక్క కాటుకి చెప్పు దెబ్బ..
కుక్క కాటుకి చెప్పు దెబ్బ తరహాలో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ‘షాక్ ట్రీట్‌మెంట్’ చేశారు. దాంతో, ‘ఆ నలుగురు’ దార్లోకి వచ్చారు. థియేటర్ల బంద్ అటకెక్కిపోయింది.
ఇప్పుడిక, థియేటర్లలో ‘దోపిడీ’పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు.
థియేటర్లలో తనిఖీల సందర్భంగా, పాప్‌కార్న్ ఖరీదు 750 రూపాయలుగా తేలింది. మంచి నీళ్ళ బాటిల్ ఏకంగా 50 రూపాయల ధర పలుకుతోంది.
సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్ళాలన్న సగటు ప్రేక్షకుడి ‘ఇష్టం’ చచ్చిపోతోంది ఈ ధరల కారణంగానే.
థియేటర్ల మాఫియా..
థియేటర్లతో ఈ తరహా ధరల మాఫియాకి అలవాటుపడ్డ కొందరు, దొంగనాటకాలు ఆడుతూ, సినిమా థియేటర్ల బంద్ అంశాన్ని తెరపైకి తెచ్చిన వైనాన్ని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు.
ఎప్పుడైతే, పవన్ కళ్యాణ్ కొరడా ఝుళిపించారో, ‘ఆయన మాకు పెద్దన్న.. తిడితే పడతాం.. కొడితే పడతాం’ అంటూ, ‘ఆ నలుగురి’లో ఒకరొకరు, మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.
Also Read: దుస్సాహసం: అల్లు అరవింద్ – ‘ది గ్రేట్ ఎస్కేప్’
ఔను, పవన్ కళ్యాణ్ చెబితే వున్నా.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి.! తన సినిమా ‘హరి హర వీర మల్లు’ నుంచే, మార్పు రావాలని కోరుకున్న బాథ్యగల వ్యక్తి పవన్ కళ్యాణ్.
లేకపోతే, వేరే సినిమాలకి పవన్ కళ్యాణ్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుని వుండేవారు. మార్పు తనతోనే మొదలవ్వాలనే గొప్ప ఆలోచన చేయగలిగే పవన్ కళ్యాణ్ కంటే గొప్పవాళ్ళెవరుంటారు.?