Home » మావిగన్ తర్వాతేంటి.? వైసీపీ క్యాడర్‌కే అర్థం కాని జగన్ వైఖరి.!

మావిగన్ తర్వాతేంటి.? వైసీపీ క్యాడర్‌కే అర్థం కాని జగన్ వైఖరి.!

by hellomudra
0 comments
Ys Jagan YSRCP

YS Jagan MaViGun Mosam.. మూడు రాజధానులన్నాం.. అంతకు ముందు అమరావతి అన్నాం.. ఆ తర్వాత విశాఖ అన్నాం.. ఇప్పుడేమో, మావిగన్ అంటున్నాం.! తర్వాతేంటి.?

రాజకీయ నాయకులన్నాక సందర్భానుసారం తమ నిర్ణయాల్ని మార్చుకుంటుంటారు. ఒక్కోసారి రాజకీయ పార్టీల సిద్ధాంతాలూ మారిపోతుంటాయ్.

కాలానుగుణంగా మార్పు తప్పనిసరి.! అది ఎవరికైనాసరే.! కానీ, పూటకో మాట చెబితే, ‘మాట తప్పను మడమ తిప్పను’ అంటూనే, పదే పదే మడమ తిప్పుతుంటే ఎలా.?

పైగా, విశ్వసనీయతకు తాను బ్రాండ్ అంబాసిడర్‌నని చెప్పుకుంటుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

‘మా జగనన్న అంతే.. మాట ఇస్తే, మడమ తిప్పే ప్రసక్తే వుండదు’ అని చెబుతుంటుంది వైసీపీ క్యాడర్. మద్య నిషేధం విషయంలో మాట తప్పాడు కదా.? అంటే, వైసీపీ క్యాడర్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి.

‘మావిగన్’ విషయంలోనూ అదే జరుగుతోంది. 2029 ఎన్నికలకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టోలో రాజధాని మావిగన్ అంశం వుంటుందని తాజాగా వైఎస్ జగన్ సెలవిచ్చారు.

అదేంటీ, గతంలో అమరావతి రాజధాని అన్నాం కదా.. ఆ తర్వాత మాట మార్చి, మూడు రాజధానులన్నాం కదా.. విశాఖే రాజధాని.. అని కూడా మాట మార్చాం కదా.. అని వైసీపీ శ్రేణులు తెగ ఇదయిపోతున్నాయి.

ఇప్పుడు కొత్తగా ఈ ‘మావిగన్’ తమ కొంప ముంచేస్తోందని వైసీపీ కార్యకర్తలు, నాయకులే వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజలకు ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళది.

అంతెందుకు, రాయలసీమ ప్రజలకు వైఎస్ జగన్ ఏం చెబుతారు.? ఉత్తరాంధ్ర ప్రజలకి ఏం సమాధానం చెబుతారాయన.? కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని.. అని ప్రకటించింది స్వయంగా జగన్.

అలానే, విశాఖ కేంద్రంగా రాజధాని.. అని స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలోనే సెలవిచ్చారు. ముచ్చటపడి, ఓ ప్యాలెస్సునీ రుషికొండ మీద కట్టించుకున్నారు.

విశాఖ పాయె.. కర్నూలు కూడా పాయో.. అమరావతి సంగతి సరే సరి. ఇప్పుడు ఓన్లీ మావిగన్.! కొందరు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, ‘ఇక వైసీపీతో కొనసాగడం కష్టం..’ అనేస్తూ, ‘గుడ్ బై’ చెప్పేస్తున్నారు కూడా.

‘మావిగన్’ విషయంలో అయినా వైఎస్ జగన్, ‘మాట మీద నిలబడతారు’ అనుకోలేమనీ, ఎన్నికల నాటికి, ఇంకేదో రాజధాని పేరుని తెరపైకి తెస్తారనీ వైసీపీ శ్రేణులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

రాజధాని అంటే, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. అలాంటి రాజధాని విషయంలో ఇంత గందరగోళం స)ష్టిస్తున్న వైఎస్ జగన్, అసలు రాజకీయాలకే పనికిరాడన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group