Pawan Kalyan Money Politics.. రాజకీయాల్లో ఏమార్చడం ముఖ్యం.! ప్రజల్ని వంచించడమే రాజకీయం అయిపోయింది ఈ రోజుల్లో.!
ప్రజలూ మారిపోయారు.! ఎన్నికల సమయంలో ఓటుకు ఏ పార్టీ ఎంత ఎక్కువ మొత్తం లంచంగా ఇస్తుందని మాత్రమే చాలామంది ఓటర్లు ఆలోచిస్తున్నారు.
అలా అమ్ముడుపోయే ఓటర్లే, రాజకీయ పార్టీల గెలుపోటముల్ని శాసిస్తున్నారన్నది నిష్టుర సత్యం.!
కొనుక్కుంటున్నారు కాబట్టి అమ్మేసుకుంటున్నాం.. అమ్ముడుపోతున్నారు కాబట్టి కొనేసుకుంటున్నాం.. ఇలా సాగుతోంది ‘సమర్థన’ వ్యవహారం.!
ఇంతలా రాజకీయాలు మారిపోయాక, ‘నేను మీ నుంచి ఏమీ ఆశించను.. నా దగ్గర డబ్బుల్లేవు.. కానీ, మీకు మంచి భవిష్యత్తునిస్తాను..’ అంటూ ఒకప్పటి రాజకీయ హుందాతనం, ఇప్పుడు జనం వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తే ఎలా.?
Pawan Kalyan Money Politics.. మారాలి.. మారి తీరాలి.!
జనసేన పార్టీ (Jana Sena Party) కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడం కోసం డబ్బులు పంచాల్సిందేనా.? అంతేనేమో.!
2019 ఎన్నికల్లో జనసేన (Jana Sena Party) ఓటమికి ప్రధాన కారణం, ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచకపోవడమేనన్నది నిర్వివాదాంశం.

అయినాగానీ, 2024 ఎన్నికల్లోనూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు ఖర్చు చేసేది లేదని జనసేన అధినేత చెబుతున్నారు.
రాజకీయమంటేనే దోపిడీ..
అధికార పీఠమెక్కగానే, అడ్డంగా దోచుకోవడం.. అనేది నేడు రాజకీయాల్లో ప్రాథమిక సూత్రం అయిపోయింది.!
ఎమ్మెల్యేల వరకూ ఎందుకు, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిథులు కూడా కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ విషయం వారిని దగ్గరగా చూస్తున్న ప్రజలకే తెలుసు.
Also Read: ప్రకాష్ రాజ్‌కి ఝలక్ ఇచ్చిన కంగనా రనౌత్.!
పంచాయితీ ఎన్నికల కోసం కూడా లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోందంటే, దానర్థమేంటి.? ఇలా ఖర్చు చేసే సొమ్ము, తిరిగి ఆ ప్రజల నుంచే కదా దోచుకోవాలి.?
‘వారాహి విజయ యాత్ర’ ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan) ఆలోచన బాధ్యతాయుతమైనదే. కానీ, ఈ రోజుల్లో అది చెల్లని వ్యవహారం.!