Pawan Kalyan Mudragada Kapu మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఈ జనరేషన్‌లో చాలా తక్కువమందికి తెలుసు ఆయన.!
ప్రస్తుత రాజకీయాల్లో అయితే, ఆయన్ని (Mudragada Padmanabham) కేవలం ‘కాపు ఉద్యమ నేత’ అని మాత్రమే కొందరు గుర్తిస్తారు.!
కానీ, కాపు సామాజిక వర్గానికి ఆయన వల్ల జరిగిన మేలు ఏంటి.? అంటే, ప్చ్.. ఎవరూ చెప్పలేరు.. చెప్పడానికీ ఏమీ లేదేమో.!
కాపు ముఖ్యమంత్రి.. అడ్డు పడుతున్న ముద్రగడ.!
కాపు సమాజాన్ని ఉద్ధరించే లక్ష్యంతోనే, కాపు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ముద్రగడ పద్మనాభం, అదే కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్‌ని ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు.?

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాకపోతే, కాపు సామాజిక వర్గం నుంచి సమీప భవిష్యత్తులో ఇంకెవరూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు.
చిరంజీవి (Mega Star Chiranjeevi) విషయంలోనే జరిగి వుండాలి.. కానీ, అలా జరగలేదు. అప్పుడు కకొన్ని శక్తులు అడ్డు తగిలాయ్.
Pawan Kalyan Mudragada Kapu.. లేఖలతో ఏం సాధిస్తారు.?
ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) అంటేనే, లేఖాస్త్రాలు సంధించడంలో దిట్ట. కానీ, ఆ అస్త్రాలకు పదును లేదు.
అవి, కాపు సామాజాన్ని చీల్చేలా కొన్ని రాజకీయ పార్టీలకు అస్త్రాలవుతాయి. అంతకు మించి, కాపు సామాజిక వర్గానికి ముద్రగడ లేఖలతో ప్రయోజనం ఏమీ లేదు.
Also Read: Apsara Rani.. శివి.! ఆర్జీవీ.! సరిపోయారు ఇద్దరూ.!
వైసీపీకి మేలు చేసి, తద్వారా జనసేన పార్టీని దెబ్బ కొట్టే లక్ష్యంతో ముద్రగడ ఈసారి లేఖల పరంపర షురూ చేశారు.
అందుకే, కాపు సమాజం.. ఈసారి ముద్రగడ లేఖల్ని పూర్తిగా లైట్ తీసుకుంది. కానీ, ఆయన మాత్రం ఆపడంలేదు. ఆపరు కూడా.!
లేఖలు ఆపితే, ఆయనకు పేమెంట్లు ఎలా వెళ్తాయ్.? అని కాపు సామాజిక వర్గంలోనే చర్చ జరుగుతోంది.!
కాపు లేఖలతోనే.. కాపు సామాజిక వర్గం కంట్లో కారం కొట్టడం.. ఇదీ ముద్రగడ లేఖాస్త్రాల వెనుక అధికార వైసీపీ వ్యూహం.!