Pawan Kalyan OG Gun.. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి అయి వుండీ, కనీసపాటి బాధ్యత లేకుండా ‘కటానా’ పట్టుకుని ఫొటోలకు పోజులిస్తారా.?
జర్నలిజం ముసుగులో ఓ గంజాయి మొక్క, కొద్ది రోజుల క్రితం, ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ‘కటానా’ పట్టకోవడంపై సంధించిన ప్రశ్న ఇది.
‘ఓజీ’ అనేది సినిమా అనీ, సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కోసం.. అభిమానుల్ని అలరించే క్రమంలో నటీనటులు, రకరకాల పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారనీ.. కనీసపాటి విజ్ఞత లేకపోవడమే నేటి పాత్రికేయం.!
దీన్ని పాత్రికేయం అందామా.? పాత్రికేయ వ్యభిచారం అందామా.? ఎవరన్నా ఏమన్నా అనుకోండి.. నలుగురూ నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్న చందాన వ్యవహరిస్తున్నారు కొందరు.
Pawan Kalyan OG Gun.. కటానా నుంచి గన్ వరకు..
‘ఓజీ’ సినిమా కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. ఈ క్రమంలో, చిత్ర యూనిట్ సభ్యులు, హీరో పవన్ కళ్యాణ్‌ని కటానా పట్టుకుని, వేదిక మీదకు రమ్మని కోరింది.
అలా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్, ‘కటానా’ పట్టుకుని కనిపించారు.
అలా రావడానికి తానెంత మొహమాటపడిందీ, దర్శకుడు సహా, టీమ్ తనపై ఎంత ఒత్తిడి తెచ్చిందీ పవన్ కళ్యాణ్ చెప్పారు కూడా.
ఇక, తాజాగా ‘ఓజీ’ సక్సెస్ సెలబ్రేషన్స్ నేపత్యంలో, పవన్ కళ్యాణ్ ఏకంగా గన్ను పట్టుకుని కనిపించారు. రష్యా తయారీ గన్ అది. కాకపోతే, ఇది జస్ట్ ఓ బొమ్మ తుపాకీ మాత్రమే.
తుపాకీ పట్టుకుని ఎంట్రీ ఇవ్వాల్సిందిగా, సుజీత్ అండ్ టీమ్ కోరితే పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా నిరాకరించారు. ‘చంపేస్తా’ అని హెచ్చరించారట సరదాగా.
Also Read: లక్కీ బాంబూ (వెదురు) మీ ఇంట్లో వుందా.?
ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. సక్సెస్ సెలబ్రేషన్ మధ్యలో, పవన్ కళ్యాణ్ వేదికపైకి రాగానే, సంగీత దర్శకుడు తమన్, ఆ గన్ తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ చేతికి అందించాడు.
సినిమా కోసం టీమ్ పడ్డ కష్టం నేపథ్యంలో, తానిలాంటివి చేయాల్సి వస్తోందని పవన్ కళ్యాణ్ ఇంకోసారి స్పష్టంగా చెప్పారు.
అయినా, అవినీతి చేసి వేల కోట్లు.. లక్షల కోట్లు కొట్టేస్తే తప్పు, నేరం, బాధ్యతారాహిత్యం కూడా.
కానీ.. సినీ నటుడిగా, సినీ వేదికలపై దర్శక నిర్మాతలు, తోటి నటీనటులు, సాంకేతిక సిబ్బంది కోరినట్లు సరదాగా వ్యవహరిస్తే తప్పేంటి.?
