Table of Contents
Pawan Kalyan OG Ticket.. సినిమా టిక్కెట్ల ధరల విషయమై ఎప్పటికప్పుడు పెద్ద రచ్చే జరుగుతోంది తెలుగునాట.!
థియేటర్లకేమో ప్రేక్షకులు సరిగ్గా వెళ్ళడం లేదాయె. టిక్కెట్ల ధరలు పెంచితే తప్ప, పెద్ద సినిమాలకు వర్కవుట్ కావడం లేదాయె.!
ఇకప్పుడు నెలల తరబడి సినిమాలు థియేటర్లలో ప్రదర్శితమయ్యేవి. ఇప్పుడు తొలి సోమవారానికే థియేటర్ల నుంచి బొమ్మ ఎగిరిపోయే పరిస్థితి.
Pawan Kalyan OG Ticket.. ఓజీ టిక్కెట్ ఐదు లక్షలు..
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ టిక్కెట్ ధర ఏకంగా 5 లక్షల రూపాయలు పలికింది. అది కూడా, ఒకే ఒక్క టిక్కెట్టు. తెలంగాణలో మొదటి టిక్కెట్టు.
అదేంటీ, తెలంగాణలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు కదా.? తొలి టిక్కెట్ ధర ఎలా ఐదు లక్షలు పలికినట్లు.? ధర పలికింది, ఆ సొమ్ములు, ఆల్రెడీ వచ్చేశాయి.
ఎక్కడికి వచ్చేశాయి.? జనసేన చేతుల్లోకి వచ్చేశాయి ఆ ఐదు లక్షలు. ఎన్నారై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బృందం, ఈ టిక్కెట్టుని కొనుగోలు చేసింది.
అభిమానుల వేలం పాట..
జనసేన పార్టీకి జనసైనికులు విరాళం ఇవ్వడం కొత్తేమీ కాదు. కాకపోతే, కొత్తగా ఆలోచించింది సదరు ఎన్నారై టీమ్. దానికి, ఇక్కడి అభిమానులు తోడయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా, ఓ స్పేస్ నిర్వహించారు. ఆ స్పేస్‌లోనే వేలం జరిగింది. మొత్తంగా టిక్కెట్ ధర 5 లక్షల దగ్గర ‘వేలం పాట’ విజయవంతంగా ముగిసింది.
ఎన్నారై బృందం ఇచ్చిన ఆ మొత్తాన్ని, డీడీ రూపంలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుకి ఇక్కడి పవన్ కళ్యాణ్ అభిమానులు (జనసైనికులు) అందించారు.
మరికొంత మొత్తం కూడా..
వేలం పాటలో టిక్కెట్ ధర ఐదు లక్షలకు వెళ్ళింది.. ఈ క్రమంలో కొంతమంది మూడు లక్షలు, నాలుగు లక్షల వరకూ పాట పాడి వుంటారు కదా.
వాళ్ళు కూడా, తాము పాడిన మొత్తాన్ని, జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని ప్రకటించడం గమనార్హం. ఇతర రాజకీయ పార్టీలకు అందే విరాళాలకీ, జనసేన పార్టీకి అందే విరాళాలకీ స్పష్టమైన తేడా వుంటుంది.
Also Read: Sarzameen Telugu Review: తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం.!
ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకో, స్కూళ్ళలో ఆట స్థలాల కోసమో, ఇతరత్రా ప్రజోపయోగ కార్యక్రమాల కోసమో.. ఈ నిథులు జనసేన తరఫున వినియోగించబడతాయి.
సో, ఈ టిక్కెట్టు వేలం మీద విమర్శలు ఎవరైనా చేయాలనుకుంటే, ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి.
ఎందుకంటే, రేప్పొద్దున్న మీకు ఏ కష్టమైనా వచ్చి, జనసేనను ఆశ్రయిస్తే.. మీకూ ఆ సాయం అందుతుంది.