Pawan Kalyan OG Ticket Hike.. పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే, చాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడుపులు మొదలవుతాయి.
ఆ పార్టీ ముఖ్య నేతలంతా పవన్ కళ్యాణ్ సినిమా మీద ఏడవడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటుంటారు.
‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’, ‘హరి హర వీర మల్లు’.. ఇలా ప్రతి సినిమా విషయంలోనూ వైసీపీ ఏడుపు ప్రతి సారీ అంతకు మించి..!
వైసీపీ హయాంలో, ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ తదితర సినిమాలకు అప్పటి మంత్రులు నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం చూశాం.
‘భీమ్లా నాయక్’ సినిమాకైతే, టిక్కెట్ల ధరల్ని గణనీయంగా తగ్గించేసి, థియేటర్లలో అధికారుల్ని మోహరించిన పరిస్థితులూ చూశాం.
వైసీపీ మార్కు దుష్ప్రచారం..
ఇప్పుడూ వైసీపీ ఏడుపులు ఆగలేదు. ‘ఓజీ’ సినిమా టిక్కెట్ ధరల్ని పెంచుకునేందుకు అవకాశమిస్తూ, ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
బెనిఫిట్ షో టిక్కెట్ల ధరల్ని వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. దాంతో, రైతుకి ఉల్లిపాయ పంటకి గిట్టుబాటు ధర లేదుగానీ.. అంటూ వైసీపీ మార్కు దుష్ప్రచారం మొదలైంది.
బెనిఫిట్ షో.. అంటే, అది అభిమానుల కోసం ప్రత్యేకంగా వేసేది. ఈ టిక్కెట్ ధర, ఎక్కువగా వుండటం అనేది దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవహారమే.
కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకే బెనిఫిట్ షోలు వేస్తున్నారని.. వైసీపీ అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. సినిమాల పట్ల కనీస అవగాహన వున్నవారెవరికైనా ఇది అర్థమవుతుంది.
నచ్చితేనే చూస్తారు..
అయినా, సినిమా అనేది వినోదం. సినిమా నచ్చితేనే ప్రేక్షకులు థియేటర్లకు వెళతారు. బాలేకపోతే, నిర్మొహమాటంగా స్టార్ హీరో సినిమానైనా తిరస్కరిస్తారు.
వెయ్యి రూపాయల టిక్కెట్ ధర భరించలేకపోతే, అభమానులు సైతం బెనిఫిట్ షోల్ని లైట్ తీసుకుంటారు. అదే, భరించగలం.. అనుకుంటే, వెయ్యి కాదు లక్ష రూపాయలైనా వెచ్చిస్తారు.
Also Read: సముద్రం.! ‘ఫిల్టర్’ అవసరమే లేని.. ‘పూజా’నందం.!
ఒకప్పుడు సినిమా టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ బాగా జరిగేది. ఇప్పుడా పరిస్థితులు తగ్గాయి. పెరిగిన టిక్కెట్ల ధరల వల్ల నిర్మాతకి లాభం.. అదే సమయంలో, ప్రభుత్వానికీ పన్నుల రూపంలో లాభం.
ఇదిలా వుంటే, ఓజీ నైజాం పస్ట్ టిక్కెట్ని ఐదు లక్షలు వెచ్చించి, అమెరికాకి చెందిన జనసేన ఎన్నారై బృందం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
చెన్నయ్, బెంగళూరు.. ఇలా పలు చోట్ల అభిమానులు, సోషల్ మీడియా వేదికగా ఓజీ తొలి టిక్కెట్లను ఆక్షన్ ద్వారా సొంతం చేసుకున్నారు.
ఆ ‘వేలం’ మొత్తాన్ని, జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నారు జనసైనికులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం.. జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో బాధ్యత.. ఇదీ జనసైనికుల నిబద్ధత.!
