Pawan Kalyan OG Trailer.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఓజీ’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ లభించేసింది. సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్స్ పడతాయ్.
టిక్కెట్ ధరలు ఏపీలో 1000 రూపాయలుగానూ, తెలంగాణలో 800 రూపాయలుగానూ ‘ఓజీ’ ప్రీమియర్ షోల కోసం నిర్ణయించారు కూడా.
మరోపక్క, లక్షలు పోసి మరీ, ఓజీ టిక్కెట్లను దక్కించుకుంటున్నారు అభిమానులు.. అది కూడా, తొలి టిక్కెట్లను.. వేలం ద్వారా.!
ఈ వేలం ద్వారా వచ్చే సొమ్ముని, జన సేన పార్టీకి విరాళంగా ఇస్తున్నారు జనసైనికులు. పవన్ కళ్యాణ్ అభిమానులు.. అందునా, జనసైనికులంటే ఆ మాత్రం వుంటుంది మరి.!
Pawan Kalyan OG Trailer.. కంటెంట్ కష్టాలు.!
అయితే, అభిమానులు ఇంతలా కష్టపడుతున్నా, ‘ఓజీ’ టీమ్ నుంచి మాత్రం ‘కంటెంట్’ సకాలంలో బయటకు రావడంలేదు. ట్రైలర్ ఇంతవరకూ రిలీజ్ చేయలేదు.
పవన్ కళ్యాణ్ స్వయంగా, ‘ఏదో ఒకటి రిలీజ్ చేసెయ్యండి..’ అంటూ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడిని అడగాల్సి వచ్చింది.
భారీ వర్షం, ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గట్టి దెబ్బే వేసేసింది. అయినాగానీ, పవన్ కళ్యాణ్ ఆ వర్షంలోనూ, తనదైన పవర్ చూపించారు.
ఆ ‘పవర్’కి అభిమానులు మురిసిపోయారనుకోండి.. అది వేరే సంగతి. వేదిక మీద ప్రదర్శించిన ట్రైలర్, యూ ట్యూబ్‌లోకి ఎందుకు రాలేదు.? అన్నది ప్రశ్న.
Also Read: Kaliyugam 2064 Review.. సాగతీత.. సర్వైవల్ థ్రిల్లర్.!
ఓ షాట్‌కి సంబంధించిన డీఐ పూర్తి కాలేదని దర్శకుడు చెప్పాడట పవన్ కళ్యాణ్‌కి. అదే నిజమైతే, పూర్తి సినిమా పరిస్థితి ఏంటి.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
నిన్న ఉదయం, అంతకన్నా ముందే విడుదలవ్వాల్సిన ట్రైలర్.. ఆలస్యమయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ విడుదల కాలేదు. రాత్రంతా అభిమానులు ఎదురుచూశారు.
దాంతో, ఏదీ కలిసి రావడంలేదు.. అన్న నైరాశ్యం అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు అందరికీ తెలిసిన విషయమే.
అయినాగానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానుల్ని అలరించడానికి పవన్ కళ్యాణ్, అంతటి భారీ వర్షంలోనూ కష్టపడ్డారు. మరి, ‘ఓజీ’ టీమ్, ఈ కష్టాన్ని, అభిమానుల ఉత్సాహాన్నీ ‘టేకిట్ గ్రాంటెడ్’గా తీసుకుందా.?
