Home » Rashmika Mandanna: ఎవర్ని భయపెట్టడానికి.?

Rashmika Mandanna: ఎవర్ని భయపెట్టడానికి.?

by hellomudra
0 comments
Rashmika Mandanna

Rashmika Mandanna Cute Expressions.. సరదాకి.! జస్ట్ సరదాకి మాత్రమే సుమీ.! అయినా, ఎవర్ని భయపెట్టడానికి ఇదంతా.? నెటిజన్లకు చాలా డౌటానుమానాలు వున్నాయ్.!

కొందరేమో, ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు క్యూటుగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోలింగ్ మాత్రం మామూలే.! అయినా, ఇందులో ‘క్యూట్’ ఏముంది.?

నేషనల్ క్రష్ కదా.. రష్మిక మండన్న ఏం చేసినా చెల్లిపోతుందనే భావన కొందరిది. అలా ఎలా కుదురుతుంది.? చిన్న పిల్లల్ని భయపెట్టేలా ఏం పనులివి.?

Rashmika Mandanna Cute Expressions.. ఇంకెప్పుడూ భయపెట్టొద్దు ప్లీజ్..

సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తే, రష్మిక మండన్న ఇంకెప్పుడూ ఇలంటి పోజులు పెట్టదన్నది కొందరి వాదన. ఛాన్సే లేదు.. ఆమెకు అదో సరదా.. అనే వాళ్ళూ వున్నారు.

అయినా, ఎవరో ఏదో అనుకుంటారనే భయమో, ఇంకొకటో వుంటే.. నటిగా, ఈ స్థాయికి రష్మిక మండన్న వచ్చి వుండేదా.? నేషనల్ క్రష్ అయి వుండేదా.?

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ.. ఇలా చాలా భాషల్లో రష్మిక మండన్నకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయా భాషల్లో మంచి మంచి సినిమాలే చేసేసింది రష్మిక.

ఈ రంజాన్ సందర్భంగా, సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘సికిందర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రష్మిక మండన్నా.

రష్మికకి అన్నీ తెలుసు..

సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేస్తే ఫాలోయింగ్ పెరుగుతుందో రష్మికకి బాగా తెలుసు. మీడియాని ఎలా మేనేజ్ చేయాలో కూడా రష్మికకి బాగా తెలుసు.

ఊరికే అయిపోతారు మరి.. స్టార్లు.! ఔను, రష్మిక నేషనల్ క్రష్ అయ్యిందంటే, ఇలాంటి క్యూట్ వేషాల వల్లే.! దానికి తోడు లక్కు, ఆపై గ్లామరు.! అదీ సంగతి.

Also Read: అక్కు పక్షీ.! విమానాల్ని ఎందుకు కూల్చేస్తున్నావ్.?

అయినాసరే, ఇంతలా భయపెట్టడం అస్సలు సబబు కాదన్నది చాలామంది అభిప్రాయమ్. నిజమే, రష్మిక మండన్న.. ఈసారి నిజంగానే భయపెట్టింది. చూస్తున్నారు కదా.! మీరూ భయపడే వుంటార్లెండి.!

సరదాకి.. జస్ట్ సరదాకి అంతే.!

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group