Table of Contents
Pawan Kalyan Palle Panduga.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘రాజకీయాల్లో మార్పు’ గురించి పదే పదే చెబుతుంటారు.
వాస్తవానికి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ, ఆ మాటకొస్తే.. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నినాదం కూడా ఈ ‘మార్పు’.. అన్నది చాలామందికి తెలిసిన విషయమే.
కానీ, రాజకీయమంటే బూతులు.. పరిపాలన అంటే, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై అధికారంలో వున్నోళ్ళు అడ్డగోలు వ్యాఖ్యలు చేయడమేనన్న చందాన తయారైంది పరిస్థితి.
వైసీపీ హయాంలో బూతుల పాలన..
వైసీపీ పాలనలో, ముఖ్యమంత్రిగా వున్న వైఎస్ జగన్.. ఏ అధికారిక బహిరంగ సభలో పాల్గొన్నా, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావనే తీసుకొచ్చేవారు.
‘పెళ్ళాలు, కార్లు..’ అంటూ, మహిళా లోకాన్ని వైఎస్ జగన్, ముఖ్యమంత్రి హోదాలో వుండీ ఏ స్థాయిలో కించపర్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రోజులు మారాయ్.. వైసీపీకి 11 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం. జనసేన పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. అధికారిక బహిరంగ సభల్లో ఎవరూ బూతులు మాట్లాడటంలేదు.
Pawan Kalyan Palle Panduga.. జనసేన స్వచ్ఛమైన రాజకీయం..
ఇంటిల్లిపాదీ, టీవీల ముందు కూర్చుని, రాజకీయ వార్తలు నిరభ్యంతరంగా చూడగలుగుతున్నారు. గతంలో అయితే, మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టినా బూతులే వినిపించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు.

‘పల్లె పండుగ’ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బృహత్కార్యం నిన్నటినుంచీ జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పంచాయితీలు, రోడ్లు, గ్రామాలు, మంచి నీళ్ళు.. ఇలా ప్రజా సంబంధిత విషయాలు తప్ప, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల జోలికి పవన్ కళ్యాణ్ ఎక్కడా వెళ్ళింది లేదు.
పవన్ గనుక, కక్ష సాధింపు రాజకీయాలు చేయాలనుకుంటే..
గతంలో తనకు జరిగిన అవమానాలకి బదులు తీర్చుకోవాలని పవన్ కళ్యాణ్ గనుక అనుకుని వుంటే, వైఎస్ జగన్ వ్యక్తిగత జీవితం గురించీ, వైఎస్ జగన్ ఇంట్లోని మహిళల గురించీ మాట్లాడేవారేమో.!

కానీ, పవన్ కళ్యాణ్ (Jana Sena Party Chief Pawan Kalyan) రాజకీయాల్లో మార్పుని కోరుకున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందిద్దామనుకున్నారు. అదే చేస్తున్నారు కూడా.!
Also Read: గిన్నీస్ రికార్డ్స్‌లో ‘మెగా’ డాన్స్! ఎర్నలిస్టుల ‘ఎక్స్‌క్లూజివ్’ కక్కుర్తి!
ఈయన నిఖార్సయిన నాయకుడు.. అంటూ, రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకుంటున్నారు జనసేనాని, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan Konidala).