Pawan Kalyan Prithviraj Sukumaran.. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన పృధ్వీరాజ్ సుకుమారన్, తన తాజా సినిమా ‘కడువా’ ప్రమోషన్ కోసం హైద్రాబాద్‌లో సందడి చేసిన విషయం విదితమే.
పృధ్వీరాజ్ సుకుమారన్ మంచి నటుడు. అభిరుచిగల దర్శకుడు, నిర్మాత కూడా. విలక్షణహైన కథల్ని ఎంచుకుంటూ, మలయాళంలో సూపర్ స్టార్ అనదగ్గ స్థాయి సంపాదించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ అనే గుర్తింపూ తెచ్చుకున్నాడు.
తెలుగులో చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాకి తమిళ మాతృక అయిన ‘లూసిఫర్’ చిత్రానికి దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్.
‘భీమ్లానాయక్’ (Pawan Kalyan Bheemla Nayak) ఒరిజినల్ వెర్షన్‌లో నటించింది కూడా పృధ్వీరాజే.
Pawan Kalyan Prithviraj Sukumaran.. పవన్ కళ్యాణ్ హీరోగా.. పృధ్వీరాజ్ దర్శకత్వంలో.?
స్వీయ దర్శకత్వంలో పృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఓ సినిమా తెరకెక్కించేందుకు తాజాగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్‌తో పృధ్వీరాజ్ సంప్రదింపులు జరపబోతున్నాడన్నది ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్.

పృధ్వీరాజ్ సినిమాలకు బడ్జెట్ పరంగా పరిమితులుంటాయ్. అదే సమయంలో, చాలా క్వాలిటీతో ఆయన సినిమాలుంటాయి. పైగా, తక్కువ సమయంలోనే సినిమాల నిర్మాణం కూడా పూర్తయిపోతుంది.
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కూడా ఈ మధ్య ఇలాంటి ఆలోచనలతోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భీమ్లానాయక్’ సినిమాని చూశాక, పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని పృధ్వీరాజ్ అనుకుంటున్నాడట.
పవన్ కళ్యాణ్ కాకపోతే ఎవరు.?
మలయాళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో సినిమా తెరకెక్కించాలనే ఆలోచనతో వున్న పృధ్వీరాజ్, తెలుగు వెర్షన్‌లో మాత్రమే పవన్ కళ్యాణ్ నటించేలా, మలయాళంలో తాను నటించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడట.
ఒకవేళ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాకపోతే, ఆ పాత్రలో చిరంజీవిని (Megastar Chiranjeevi) అడగాలని పృధ్వీరాజ్ సుకుమార్ అనుకుంటున్నాడని తెలుస్తోంది.
Also Read: Malavika Mohanan Tauba.. వావ్.! జస్ట్ రాకింగ్.!
ఏమో, ఈ ప్రచారంలో నిజమెంతోగానీ, పృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమా అంటే.. అది ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తుందన్నది నిర్వివాదాంశం.
అయితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి వున్న కమిట్మెంట్స్ నేపథ్యంలో, ఈ కాంబినెషన్ సెట్ అవడం అంత తెలిక కాదు. కానీ, నిప్పు లేకుండా పొగ అయితే రాదు కదా.? ఏమో, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.