Pawan Kalyan Remuneration.. ఒక్క రోజుకి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అది కూడా తన తాజా సినిమా కోసం.
సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా అది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 22 నుంచి 25 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించిన సంగతి తెలిసిందే.
రాజకీయమంటే దోచుకోవడం.. దాచుకోవడం.!
కోట్లకు పగడగలెత్తిన రాజకీయ నాయకుడు సైతం, ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు లెక్కలే చూపిస్తాడు.!
లగ్జరీ కార్లలో తిరుగుతూ, సొంత కారు లేదంటాడు రాజకీయ నాయకుడు.!
సినిమా హీరోలు తమ రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా చెప్పడం అస్సలు జరగదు.!
కానీ, పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ రోజుకి 2 కోట్లని ధైర్యంగా చెబుతున్నారంటే.. అదీ దమ్మున్నోడి లెక్క.!
రాజకీయమంటే జవాబుదారీతనం.. సంపాదన వివరాల్ని వెల్లడించిన జనసేనాని ఎంతోమందికి ఆదర్శం.!
Mudra369
అంటే, 44 కోట్ల నుంచి 50 కోట్ల వరకు వుండొచ్చు మొత్తంగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్. ‘అందరు నిర్మాతలూ అలాగే ఇస్తారని కాదుగానీ..’ అంటూ అసలు విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేశారు.!
Pawan Kalyan Remuneration.. దమ్మున్నోడు పవన్ కళ్యాణ్..
ముఖ్యమంత్రి పదవుల్లో వున్నోళ్ళూ.. తమకు సొంత కారు లేదని ఎన్నికల సమయంలో అఫిడవిట్లు దాఖలు చేస్తుంటారు.
అసలు ఎలాంటి గౌరవ వేతనం తీసుకోకుండానే ముఖ్యమంత్రి పదవిలో బాధ్యతాయుతంగా పాలన చేస్తున్నామని చెప్పుకుంటూ, డాబుల కోసం.. సొంత పబ్లిసిటీ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుంటారు.
కానీ, పవన్ కళ్యాణ్ అలా కాదు.! నా రెమ్యునరేషన్ రోజుకి రెండు కోట్లు.. అని ధైర్యంగా ప్రకటించేశారు. సినీ రంగంలో ఏ ఇతర హీరో.. రాజకీయాల్లో ఏ ఇతర నాయకుడూ ఇలా తమ సంపాదన గురించి ప్రకటించే పరిస్థితే వుండదు.
టాలీవుడ్‌లో హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్..
పవన్ కళ్యాణ్ సినిమాలకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయ్. విడుదల సమయంలో నానా పాట్లూ పడాలి. కానీ, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ రాకెట్ స్పీడ్‌తో పెరుగుతోంది.
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
దటీజ్ పవన్ కళ్యాణ్.! ఎవరేమనుకున్నాసరే, నిజాయితీనే నమ్ముకున్నానని పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. ఆ నిజాయితీకే కట్టుబడి వున్నారాయన.
రాజకీయాల్లో ట్రాన్స్‌పరెన్సీ.. అదేనండీ పారదర్శకత అవసరం. అది టన్నుల్లో వుంది పవన్ కళ్యాణ్ దగ్గర.! ఎనీ డౌట్స్.?