Pawan Kalyan Republic.. పిచ్చి ముదిరి పాకాన పడ్డం అంటే ఇదే. రాజకీయ నాయకులు పూటకో పార్టీ మార్చేస్తున్న రోజులివి. ఈ పార్టీలో గెలిచినోడు, ఆ పార్టీలోకి, ఆ పార్టీలో గెలిచినోడు ఈ పార్టీలోకీ దూకేయడం నిత్యం చూస్తూనే ఉన్నాం. రాజకీయం అంటే జస్ట్ కప్పల తక్కెడ వ్యవహారమంతే.
ఓ పార్టీకి జనం ఓట్లేసి అధికారమిస్తే, ఆ పార్టీకి ఐదేళ్లు ఓటర్లు బానిసత్వం చేయాలనే రూల్ ఏమైనా వుందా.? ఓ ప్రముఖ దర్శక, నిర్మాత (సినిమాలొదిలేసి చాన్నాళ్లే అయ్యింది) సిద్ధాంతం చూస్తే, గెలిచిన పార్టీలకి ఓటర్లు బానిసత్వం చేయాల్సిందే.. అని అనిపించక మానదు.
Pawan Kalyan Republic పవన్ ప్రశ్నిస్తే.. జనం సినిమాలు చూడటం మానేస్తారా.?
‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడకలో పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సినిమా టికెట్ల విషయంలో నిలదీశారు. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు మాత్రమే కాదు, జనసేన పార్టీకి అధినేత కూడా. అలా ఆయన తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టేసి సినిమా రంగానికి సంబంధించి రాజకీయ పరమైన విమర్శలు కూడా చేశారు. అది తప్పా.? ఒప్పా.? అన్నది వేరే చర్చ.
పైన ఆ సిద్ధాంతం చెప్పిన మహానుభావుడు ఎవరూ కాదు.. తమ్మారెడ్డి భరద్వాజ్. పవన్ కళ్యాణ్ వల్ల ‘రిపబ్లిక్’ సినిమాకి నష్టాలొచ్చాయట. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన 53 శాతం మంది ఓటర్లలో పది శాతం మంది అయినా ఆ సినిమాని చూడడం మానేసి ఉంటారని తమ్మారెడ్డి (Tammareddy Bharadwaja) సెలవిచ్చారు.
Also Read: Republic Cinema Review.. సినిమా కాదిది నిజం.!
తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే సీనియర్ నిర్మాత, దర్శకుడు. పరిశ్రమ పెద్దలు అనదగ్గ వారిలో ఈయన పేరు కూడా వినిపిస్తుంటుంది. సినిమా పట్ల కనీసపాటి జ్ఞానం లేకుండా ఈయనెలా మాట్లాడగలిగినట్లు.? కొన్నాళ్ల క్రితం చంద్రబాబు మీద కక్ష్యతో వివాదాల దర్శకుడొకడు సినిమాలు తెరకెక్కించాడు. మరి ఆ సినిమాకి నష్టాలొచ్చాయని ఈ తమ్మారెడ్డి ఎందుకు మాట్లాడలేకపోయాడు.?
పవన్ కళ్యాణ్.. ప్లస్సా.? మైనస్సా..?
‘రిపబ్లిక్’ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ మ్యాగ్జిమమ్ వర్కువట్ అయ్యింది. సగటు సినీ ప్రేక్షకుడు ఆశించిన వినోదం అందులో లేకపోవడం వల్ల ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయి ఉండొచ్చు. అంతకు మించి ఆ సినిమాపై రాజకీయం ఎలాంటి నెగిటివ్ ప్రభావాన్ని చూపించలేదు. కాస్తో కూస్తో.. ఇలాంటి వివాదాల వల్ల సినిమాలకు లాభమే తప్ప నష్టముండదు.

తమ్మారెడ్డి భరద్వాజ్ కాకుండా ఇంకెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుంటే, ‘అరేయ్ వెర్రి వెంగళప్పాయ్.. ఓట్లేయడానికీ, సినిమా చూడ్డానికీ లింకు పెడుతున్నావ్.. నువ్వేం సినీ మేధావివిరా.?’ అంటూ సెటైర్లు పడేవే. అన్నట్టు, సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు తమ్మారెడ్డిపై నెటిజన్లు వేస్తున్న సెటైర్లు ఆషామాషీగా లేవండోయ్.! ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఎవరి మెప్పుకోసమో పాకులాడి, తన స్థాయిని ఇంతలా దిగజార్చేసుకోవడం శోచనీయం.
Also Read: సినీ, రాజకీయ ‘కథానాయకుడు’ పవన్ కళ్యాణ్.!
‘వకీల్ సాబ్’ సినిమాని తొక్కేశాం.. అని ఘనంగా చెప్పుకున్న వైసీపీ నాయకులే, ఆ సినిమా ఏపీలో రికార్డు స్థాయి వసూళ్లను సాధించిందని కలెక్షన్ల లెక్కలు చెప్పారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Republic) మీద పడి ఏడవడం తప్ప ఇంకేమీ చేతకాని సో కాల్డ్ ‘మేతా’వుల్లో తమ్మారెడ్డి భరద్వాజ్ (Tammareddy Bharadwaj) కూడా ఒకరు.
చివరగా.. ‘అజ్ఞానం గూడు పెట్టిన చోటే, మోసం గుడ్లు పెడుతుంది..’.!