Pawan Kalyan Responsible Politics.. ఓ సినీ నటుడు.. లగ్జరియస్ లైఫ్‌ని వదిలేసుకుని, ప్రజా జీవితంలోకి ఎందుకొస్తాడు.? సినిమాల్లో చూడని పేరు ప్రఖ్యాతులేముంటాయ్.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Jana Senani Pawan Kalyan) అంటే అదొక పేరు కాదు, బ్రాండ్.! సినీ నటులకు అభిమానులంటారు.. కానీ, పవన్ కళ్యాణ్ విషయంలో ‘ఫాలోవర్స్’ వుంటారు.!
అభిమానం.. అని పేరు పెట్టుకోవడం కాదు, ‘పవనిజం’ అనే ఓ కొత్త ‘ఇజాన్ని’ సృష్టించుకున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు.!
మరి.. అభిమానులే అలా వున్నప్పుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ఇంకెలా వుంటారు.? అందుకే, జనసేనాని అయ్యారు.!
Pawan Kalyan Responsible Politics.. ఇష్టమైన సినిమా..
ఔను, పవన్ కళ్యాణ్‌కి సినిమా అంటే ఇష్టమే.! కాదని ఎవరన్నారు.? ఇష్టం లేకుండా, సినీ నటుడిగా అత్యున్నత శిఖరాల్ని ఎలా అధిరోహించగలడు.?
సినిమా అంటే ఇష్టమే.. అదే సమయంలో, సమాజమంటే బాధ్యత.! ఆ బాధ్యతతోనే ప్రజా జీవితంలోకి వచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

హిట్టూ ఫ్లాపూ.. వీటికి అతీతం, పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్. రాజకీయం కూడా అంతే అనుకున్నారాయన.! ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమేనని తెలుసు పవన్ కళ్యాణ్‌కి.
గెలవడమంటే, ఇక్కడ ప్రజల మనసుల్ని గెలవడం.! కేవలం ఓట్లను గెలవాలనుకుంటే, దానికి వేరే పద్ధతులుంటాయ్.! కానీ, అలాంటి అక్రమ మార్గాల వైపు జనసేనాని ఏనాడూ అడుగేయలేదు.
సమాజమంటే బాధ్యత..
సమాజం పట్ల బాధ్యత వున్నోడు, ఆ సమాజంలోని లోటుపాట్లను సరిచేయాలనుకుంటాడు. అంతేగానీ, లోటుపాట్లను వాడుకుని, అక్రమంగా అధికార పీఠమెక్కాలనుకోడు.
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
పవన్ కళ్యాణ్‌కీ.. ఇతర రాజకీయ నాయకులకీ అదే తేడా.! జనాన్ని గెలిపించడమే, జనసేన లక్ష్యమని చెబుంటారు పవన్ కళ్యాణ్.
కష్టమైన పనే ఇది.! కానీ, ఇష్టంగా.. మంచి మార్పు కోసం కష్టమైన రాజకీయ బాటని ఎంచుకున్నారు జనసేనాని.!
తీరిగ్గా, యాభై నుంచి డెబ్భయ్ రోజుల డేట్స్ కేటాయించి.. సరదాగా సినిమా షూటింగ్‌ని ఎంజాయ్ చెయ్యక.. ఎండనక.. వాననక.. రాజకీయాల్లో ఎందుకు తిరగాలి.?
యాభై నుంచి డెబ్భయ్ రోజులు షూటింగ్‌లో పాల్గొనాల్సి వున్నా.. అంత కష్టాన్ని ఇరవై రోజుల్లోనే పడి.. ఒళ్ళు ఎందుకు హూనం చేసుకోవాలి.?

ప్రజల కష్టాల్ని తన కష్టాలుగా భావించి, వారి బతుకుల్ని బాగు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేయాలనుకుంటున్నారు జనసేనాని.
తన సంపాదన నుంచి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన కౌలు రైతుల కుటుంబా్ని ఆదుకోవడమంటే చిన్న విషయం కాదు.!
సినిమా పట్ల వున్న ఇష్టాన్ని.. తప్పనిసరి అవసరంగా మార్చుకుని.. ప్రజలంటే ఓ బాధ్యత అనుకున్న జనసేనాని అభినందనీయుడు.
గెలుపోటముల భయం లేదు.! ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న భయం అసలే లేదు.! రాజకీయ ప్రత్యర్థులు తనను అంతమొందిస్తారేమోనన్న ఆందోళనా లేదు.! ఈ తెగింపు జనం కోసం.!