Pawan Kalyan Roja Icecream.. మినిస్టర్ రోజా అంతే.! ఆమె ఏం మాట్లాడతారో ఆమెకే తెలియదు. తెగ ఆయాసపడిపోతుంటారు ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడానికి.
పాపం.. సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారామె. వచ్చే ఎన్నికల్లో ఆమెకు నగిరి నుంచి టిక్కెట్ దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి.
ఇంత ఫ్రస్ట్రేషన్‌లోనూ అధినాయకత్వం ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాల్సి వుంటుంది. రోజా ఈ క్రమంలో కాస్త అత్యుత్సాహం చూపించారు. అభాసుపాలయ్యారు.
Pawan Kalyan Roja Icecream.. ఐస్‌క్రీమ్ గోలేంటి.?
రాష్ట్రంలో పెద్దయెత్తున మహిళలు అదృశ్యమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. దానికి వైసీపీ వాలంటీర్ వ్యవస్థే కారణమన్నది జనసేన అధినేత చేస్తున్న ఆరోపణ.
ఈ ఆరోపణలపై మంత్రి రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖండించి పారేశారు ఆ ఆరోపణల్ని. కానీ, ఈ క్రమంలో ఆమె ‘ఐస్‌క్రీమ్’ ప్రస్తావన తీసుకొచ్చారు.
అది కూడా హెరిటేజ్ ఐస్‌క్రీమ్.! చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడుతూ, హెరిటేజ్ ఐస్‌క్రీమ్ నోట్లో పెట్టుకున్నావా.? అంటూ జనసేన అధినేత మీద మండిపడిపోయారు.
ఎవరి నోట్లో.. ఆ ఐస్‌క్రీమ్.?
టీడీపీకి జనసేన మిత్రపక్షం అవుతుందా.? లేదా.? అది 2024 ఎన్నికల్లో తేలుతుంది. కానీ, టీడీపీలో చాలా ఏళ్ళు పని చేశారు సినీ నటి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రోజా.

తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా రోజా పనిచేసిన సంగతి తెలిసిందే. రెండు దఫాలు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా.
మరి, చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ కంపెనీ ఐస్‌క్రీమ్‌లతో సంబంధం అంటూ ఏదన్నా వుంటే రోజాకి వుంటుందా.? పవన్ కళ్యాణ్‌కి వుంటుందా.?
Also Read: ‘వారాహి’ అంటే పంది కాదు.! దేవతరా.! అచ్చోసిన ఆంబోతూ.!
ఐస్‌క్రీమ్.. అసలేంటీ ప్రస్తావన.? ఎంత అసభ్యకరంగా వుంది.? ఆ ఐస్‌క్రీమ్‌కి అర్థమేంటో చిన్న పిల్లలకూ తెలుసు ఈ రోజుల్లో.!
ఏ ఉద్దేశ్యంతో రోజా ఆ ఐస్‌క్రీమ్ ప్రస్తావన తెచ్చినా.. అది అత్యంత జుగుప్సాకరం.! ఇదిగో.. ఇలాంటివాళ్ళ వల్లనే రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయ్.!
గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. రేప్పొద్దున్న ఏ పార్టీలో వుంటారో తెలియదు.. అలాంటప్పుడు.. ఎందుకిదంతా.?