Table of Contents
Pawan Kalyan Security సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళితే, అక్కడ పరిస్థితి ఎలా వుంటుంది.? జన సునామీ కనిపిస్తుందక్కడ. దటీజ్ పవన్ కళ్యాణ్. అయితే, ఆ జన సునామీనే పవన్ కళ్యాణ్‌కి (Pawan Kalyan) ఇబ్బందులు తెచ్చిపెడుతోందిప్పుడు.
పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా అభిమానులే ఆయనకు భద్రతగా వుంటారు. అలాంటిది, ఆ అభిమానుల్లో కొందరి అత్యుత్సాహం ఆయన భద్రతకు ముప్పు వాటిల్లేలా చేస్తే.? ఆ అభిమానం వల్ల ఆయనకు ప్రమాదం తలెత్తితే.? అస్సలేమాత్రం మంచిది కాదది.
Pawan Kalyan Security.. నాయకుడ్ని ప్రమాదంలోకి నెట్టేస్తారా.?
ఇటీవల పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన జనసేన పార్టీ (Jana Sena Party) బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళితే, ఓ అబిమాని పవన్ కళ్యాణ్ మీదకు దూసుకొచ్చాడు. అలా దూసుకొచ్చిన వ్యక్తిని భద్రతా సిబ్బంది నిలువరించగలిగారు.
కానీ, మరో అభిమాని కూడా పవన్ మీదకు అలాగే దూసుకెళ్ళాడు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, తాను ప్రయాణిస్తున్న కారు మీదకి ఎక్కి ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. ఒక్కసారిగా అభిమాని దూసుకొచ్చేసరికి పవన్ కళ్యాణ్ కిందపడిపోయారు.
Pawan Kalyan Security.. అభిమానం సరే, బాధ్యత ఏదీ.?
కాస్తలో పెను ప్రమాదం తప్పిపోయిందిగానీ, లేదంటే కారు మీద నుంచి కిందికి పడిపోయేవారే పవన్ కళ్యాణ్. అసలు సిసలు అభిమానులెవరైనా తాము అభిమానించే వ్యక్తికి ఇంతలా హాని తలపెడతారా.?
అభిమానుల అత్యుత్సాహంపై పవన్ తన సన్నిహితుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారి అభిమానం అలాంటిది. అయినాగానీ, ఆ అత్యుత్సాహం కారణంగా నాతోపాటు, వారికీ ప్రమాదం సంభవించొచ్చు..’ అని అంటుంటారు పవన్ కళ్యాణ్.
అభిమానులే భద్రతా కవచం కదా.?
అభిమానించడమంటే, తాము అభిమానించే వ్యక్తి మనసెరిగి ప్రవర్తించడం. లక్షలాదిగా, కోట్లాదిగా వున్న అభిమానుల్లో కొందరి అత్యుత్సాహాన్ని అందరికీ ఆపాదించడం సరికాదు. పవన్ ఎప్పుడు జనంలోకి వచ్చినా, వందలాది వేలాది మంది అభిమానులు ఆయనకు రక్షణగా నిలుస్తారు.
Also Read: గోతికాడి నక్కలకి గూబ గుయ్యమంది ‘బాస్’.!
అడపా దడపా జరిగే తప్పిదాలే అయినా, ప్రమాదవశాత్తూ అవి ఘోర తప్పిదాలుగా మారితే.? వ్యక్తిగత భద్రత విషయమై పవన్ కళ్యాణ్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.. పార్టీ పరంగానూ పవన్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. అదే సమయంలో అభిమానులూ ఒకింత ఎక్కువ సంయమనం పాటించాల్సిందే.
సినీ హీరోలకి అభిమానులుంటారు.. కానీ, పవన్ కళ్యాణ్‌కి మాత్రమే భక్తులుంటారని పదే పదే ఆయన్ని అభిమానించేవారు చెబుతుంటారు. అందులో నిజం లేకపోలేదు.
పవనిజం.. జనసేనాని రక్షణ ముఖ్యం..
కానీ, కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ఆ కారణంగా ఏదన్నా అనుకోని ఘటన జరిగితే, మొత్తం అభిమానగణానికే చెడ్డపేరు వస్తుంది కాబట్టి, అత్యుత్సాహం ప్రదర్శించేవారిని అభిమానులే ఓ కంట కనిపెట్టాలి.
రాజకీయ ప్రత్యర్థులెప్పుడూ అవకాశం కోసం ఎదురుచూస్తూనే వుంటారు. చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం చేద్దామని చూసే సోకాల్డ్ ‘హేటర్స్’కి అవకాశమివ్వకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ అభిమానులదే.
సుశిక్షితులైన సైనికుల తరహాలో పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంటారు. అదే తరహాలో, పవన్ భద్రత పట్ల కూడా ఒకింత ప్రత్యేకమైన జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది.