Table of Contents
Pawan Kalyan Senatho Senani.. క్రియాశీల కార్యకర్తలంటే ఏంటి.? పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి పని చేసే కార్యకర్తలే క్రియాశీల కార్యకర్తలు. అందులో, జనసైనికులు ఇంకాస్త ప్రత్యేకం.
సాధారణంగా రాజకీయ పార్టీల కార్యకర్తలంటే, సభ్యత్వ నమోదు పేరుతో ఇష్టమొచ్చినట్లు సభ్యత్వాలు ఇచ్చేసుకుంటూ వెళ్ళి, ‘నెంబర్’ చూపించుకోవడం.
కొన్ని పార్టీలకు అసలు సభ్యత్వ నమోదు ప్రక్రియ కూడా వుండదు. కార్యకర్తలంటే కార్యకర్తలంతే. డబ్బులిచ్చి, బహిరంగ సభలకి జనాల్ని రప్పించుకోవడం చాలా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి.
అధినేత బాటలో జన సైనికులు..
జనసేన కార్యకర్తలు వేరు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, జనసేన పార్టీ కోసం పని చేస్తారు. అధినేత పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తారు.
‘ప్రశ్నించడం కోసమే రాజకీయం చేస్తాం..’ అని జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో జనసేనాని చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన పిలుపు.. ఆ పార్టీ నిబద్ధతని ఆనాడే తెలియజేసింది.
అభిమానులే, జనసైనికులయ్యారు.. వాళ్ళే క్రియాశీల కార్యకర్తలుగా మారారు. మరి, అలాంటి క్రియాశీల కార్యకర్తలకు, పార్టీలో చిన్నా చితకా సమస్యలు ఎదురైతే.?
Pawan Kalyan Senatho Senani.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని..
ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, అధికార పీఠమెక్కాక.. జనసేన పార్టీ, క్రియాశీల కార్యకర్తలపై మరింత ఫోకస్ పెడుతూ, ‘సేనతో సేనాని’ అంటూ, విశాఖ వేదికగా అద్భుతమైన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం వేదికగా, క్రియాశీల కార్యకర్తలతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. వారిని, బహిరంగ సభలో మాట్లాడనిచ్చారు.
జనసేన రాజకీయ ప్రస్థానం గురించి మళ్ళీ గుర్తు చేస్తూ, రాజకీయాల్లో జనసేన తీసుకురాబోయే మార్పుల గురించి మరింత వివరంగా క్రియాశీల కార్యకర్తలకు చెప్పారు జనసేనాని పవన్ కళ్యాణ్.
నిబద్ధతే పదవుల్ని తెస్తుంది..
ఎంత నిబద్ధతతో పని చేస్తే, పార్టీలో ఎలాంటి పదవులు వస్తాయన్నదానిపై జనసేనాని క్రియాశీల కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
దాంతో, జనసేన క్రియాశీల కార్యకర్తల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ జనసేన పార్టీ పట్ల గౌరవం మరింత పెరిగింది. జనసేన నాయకులు సైతం, తామెంత క్రియాశీలంగా వుండాలో అర్థం చేసుకున్నారు.
క్రియాశీల కార్యకర్తలు బలంగా నిలబడితే, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి జనసేన పార్టీ ఎదుగుతుందని జనసేనాని స్పష్టం చేశారు.
దేశ రాజకీయాల్లోనూ, ‘సేనతో సేనాని’ కార్యక్రమం అత్యంత ప్రత్యేకమైనదని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
సోషల్ సైనికులు..
సోషల్ మీడియాలో తమ ఫేస్ రివీల్ చేయకుండానే, జనసేన పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న జనసైనికుల్ని, ‘సేనతో సేనాని’ కార్యక్రమం ద్వారా పరిచయం చేయడం గమనార్హం.
వీళ్ళే జనసేన పార్టీకి భవిష్యత్ నాయకులు.. అన్న సంకేతాల్ని ‘సేనతో సేనాని’ కార్యక్రమం ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లయ్యింది.
జనసైనికుల్ని, జనసేన వీర మహిళల్ని.. పవన్ కళ్యాణ్ ఎంత బాధ్యతగా చూసుకుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?