Pawan Kalyan Tej Accident.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ‘దైవాంశ సంభూతుడు’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే.
మరోపక్క, దర్శకుడు సముద్రఖని ‘టైమ్ దేవుడు’గా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించాడు. ‘నా వరకూ నా టైమ్ దేవుడు పవన్ కళ్యాణ్’ అని చెప్పేశాడు సముద్రఖని.
ఏదో ముఖస్తుతి కోసం.. ఇలా బ్రహ్మానందం, సముద్రఖని అన్నారని అనుకోలేం.! పవన్ కళ్యాణ్‌ని కొంతమంది చూసే దృష్టికోణం అలానే వుంటుంది.
ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యేవాళ్ళు పదుల్లో కాదు.. వందల్లో, వేలల్లో, లక్షల్లో.. కోట్లలో వున్నారు.!
Pawan Kalyan Tej Accident.. ఆ పరిస్థితిని చూడలేక.!
కానీ, పవన్ కళ్యాణ్ కూడా ఓ దశలో నమ్మకం కోల్పోయారు.! అది కూడా, తనకెంతో ఇష్టమైన తన మేనల్లుడి విషయంలో.
సాయి ధరమ్ తేజ్ కొన్నాళ్ళ క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దాదాపు 12 రోజులపాటు కోమాలో వున్నాడు సాయి ధరమ్ తేజ్.
పలు సర్జరీలు కూడా జరిగాయి. మెదడుకి బలంగా దెబ్బ తగలడం వల్ల, మాట కూడా కోల్పోయాడు కొన్ని రోజులపాటు. స్పీచ్ థెరపీతో తిరిగి మామూలుగా మాట్లాడగలుగుతున్నాడిప్పుడు.

ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన రోజు, డాక్టర్లు చెప్పిన పరిస్థితిని చూసి, పవన్ కళ్యాణ్ నమ్మకం కోల్పోయారట. ఆ సమయంలో జగన్మాతని బలంగా కోరుకున్నారట.. సాయిధరమ్ తేజ్ కోలుకోవాలని.
Also Read: Kajol Devgn Trial Kiss.. ఈ ముద్దు అవసరమా కాజోల్.!
‘అంతకన్నా ఏం చేయగలం.? భవిష్యత్తు వున్న కుర్రోడు.. అలా పడి వుండడం.. అత్యంత ఆవేదనాభరితం..’ అంటూ పవన్ కళ్యాణ్ ‘బ్రో’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎమోషనల్ అయ్యారు.
ఆ సమయంలో, మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు. మద్యం సేవించి వాహనాన్ని నడిపాడని కొందరు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపాడని.. మరికొందరు న్యూస్ ఛానళ్ళలో దుష్ప్రచారాలు చేశారు.
ఓ వైపు సాయి ధరమ్ తేజ్ అపస్మారక స్థితి.. ఇంకో వైపు, మీడియాలో ఈ ఛండాలం.! పవన్ కళ్యాణ్ అనే కాదు, చిరంజీవి సహా, మెగా ఫ్యామిలీ పరిస్థితి ఎలా వుండి వుంటుందో.!